Connect with us

News

ముఖ్యమంత్రి కి బ్రాహ్మణ సమస్యలు వివరించిన రాష్ర్టబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెల్లాల మధుసూదన శర్మ

Published

on

గురువారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు పథకం ద్వారా చేతివృత్తుల వారికి అండగా నిలవడానికి ఎమ్మిగనూరు పట్టణానికి వచ్ఛిన సందర్భంగా ఆపన్నప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వెల్లాల మధుసూదనశర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి రాష్ట్రములోని బ్రాహ్మణ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మధుసూదనశర్మ తో మాట్లాడుతూ ఎలాంటి సహాయం బ్రాహ్మణులకు అవసరమవుతుంది అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సమస్యలను ముఖ్యమంత్రి జగనన్నకు వివరిస్తూ ఈబిసి నేస్తం ద్వారా చాలా మంది బ్రాహ్మణ మహిళలకు లబ్ధి చేకూరుతోంది అందుకు జగనన్నకు కృతజ్ఞతలు తెలిపడమే కాకుండా పేద బ్రాహ్మణ యువతులకు వివాహములు జరిపించడం తల్లిదండ్రులకు భారంగా మారిందని అందువల్ల “వేదమాత కల్యాణ వైభవం” అనే పథకము ప్రవేశపెట్టి లక్షా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేస్తే బాగుంటుందని తెలపడమే కాకుండా బ్రాహ్మణులు ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలు, కర్మలు, చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి కష్టాలను తొలగించడానికి “వేదబ్రాహ్మణ అంతిమయాత్ర ఆసరా ” అనే పేరుతో యాభైవేల రూపాయలు అందించాలని, అలాగే క్రెడిట్ సొసైటీ ద్వారా చేతివృత్తులకు, చిన్న వ్యాపారాలు చేసుకునే బ్రాహ్మణ మహిళలకు లక్షరూపాయలు వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని, కర్నూలు పట్టణములో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారు వారు వివాహాలు, కార్తీక బోజనాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానాకి చాలా ఇబ్బందులు పడుతున్నారని దయచేసి కర్నూలు పట్టణములో బ్రాహ్మణ భవణము నిర్మించాలని మధుసూదనశర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కోరడం జరిగిందని తెలిపారు.

సీఎం జగన్మోహన్ రెడ్డిని కలసి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వెల్లాల మధుసూదనశర్మ

ముఖ్యమంత్రి జగనన్న సానుకూలంగా స్పందించి ఆయన వ్యక్తిగత కార్యదర్శి చెప్పి మధుసూదన శర్మ ఫోన్ నెంబర్ తీసుకున్నారని మధుసూదన్ శర్మ తెలిపారు. వివరించినంతసేపు శ్రద్ధగా విని సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కి, ఆదోని వైఎస్సార్ పార్టీ యువనేత వై. జయమనోజ్ రెడ్డి కి ధన్యవాదములు తెలియచేసారు.

సీఎం జగన్మోహన్ రెడ్డిని సమస్యలను వివరిస్తున్న బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వెల్లాల మధుసూదనశర్మ
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని డివిజన్ APRSA అధ్యక్షుడిగా రజినీకాంత్ రెడ్డి

Published

on

ఆదోని: కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (APRSA) ఆదోని డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం (జూలై 19న) స్థానిక రెవెన్యూ భవన్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఎన్నికల అధికారి శ్రీ డి. నిజాముద్దీన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. నోటిఫికేషన్ ప్రకారం కొన్ని పదవులకు పోటీ జరగ్గా, మరికొన్ని పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం 2026-2029 కాలానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు.

మానసికరం చేస్తున్న నూతనంగా ఎన్నికైన రెవెన్యూ శాఖ అధికారులు

నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు:

  • ప్రెసిడెంట్: రజినీకాంత్ రెడ్డి (కౌతాళం తహశీల్దార్)
  • అసోసియేట్ ప్రెసిడెంట్: జె. బాబు (ఆదోని డిప్యూటీ తహశీల్దార్)
  • సెక్రటరీ: వలిబాషా (పెద్దకడుబూరు తహశీల్దార్)
  • ట్రెజరర్: రాఘవేంద్ర
  • వైస్ ప్రెసిడెంట్లు: రుద్రగౌడ్, జెర్మియా, కౌసర్ భాను
  • జాయింట్ సెక్రటరీ: మహేష్
  • ఎగ్జిక్యూటివ్ మెంబర్: రామయ్య
  • స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ: బి. పెద్దయ్య
ఎన్నికల నిర్వహిస్తున్న ఫోటో

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు రెవెన్యూ శాఖ అధికారులు, సహచర ఉద్యోగులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని, సేవా సమస్యల పరిష్కారానికి, రెవెన్యూ శాఖ అభివృద్ధికి మరియు ఉద్యోగుల ఐక్యతకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఎన్నికైన అధికారుల గ్రూప్ ఫోటో
Continue Reading

News

ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిష్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులతో ప్రైవేట్ వ్యక్తులతో అనధికారికంగా ఉన్న  1లక్ష 18 వేల 700 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్సీ సీతారామారావు తెలిపారు.

పూర్తి వీడియో చూడాలంటే యూట్యూబ్ లింకులు క్లిక్ చేయండి

డీఎస్పీ సీతారామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు ఆకస్మికంగా నిర్వహించామని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు నలుగురు అనధికారులు, ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు వారి అసిస్టెంట్లు మరియు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఇద్దరు ప్రవేటు వ్యక్తులు ఉన్నారని వారిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణయ్య వారి సిబ్బంది పాల్గొన్నట్లు  తెలిపారు.

సబ్ రిజిస్టర్ అధికారి
తనిఖీలు చేస్తున్న అధికారులు
తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
Continue Reading

News

జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు  చేస్తున్న అరాచకాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కి తెలుపవచ్చు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన
Continue Reading
News2 weeks ago

ఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి

News2 weeks ago

కుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..

News2 weeks ago

ఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు

News2 weeks ago

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

News4 weeks ago

అదోనిలో 30 లక్షలు విలువ చేసే 35  బైక్లు స్వాధీనం

News2 weeks ago

వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్

News1 week ago

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

News2 weeks ago

నిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్

News4 weeks ago

అదోనిలో 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం

News2 weeks ago

పేద కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆర్థిక సాయం

Trending