Connect with us

News

ఆదోని అభివృద్ధి కోసం కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే పార్థసారథి

Published

on

ఢిల్లీ – ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఢిల్లీ పర్యటన లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మర్యాదపూర్వకంగా కలసి నూతన కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కర్నూలు జిల్లా అభివృద్ధికి మీ తోడుండాలని కోరారు అందుకు సానుకూలంగా స్పంది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తప్పకుండా కర్నూలు జిల్లా అభివృద్ధికి తోడుంటానని మాటిచ్చారని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు

కర్నూలు జిల్లా మరియు ఆదోని అభివృద్ధి కోసం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఢిల్లీలో పర్యటిస్తూ పలు జాతీయ నాయకులతో కలసి అభివృద్ధిపై చర్చలు చేసి తమ వంతు సహాయపడాలని కోరారు. జాతీయ నాయకులు ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి నీ వెంటే ఉన్నామని తెలిపినట్లు ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. ఆదోని ఎన్నడూ లేని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయం సహకారాలతో అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే పార్థసారథి ధిమా వ్యక్తం చేశారు.

కేంద్ర నాయకులతో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి
కేంద్ర నాయకులతో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి
రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరితో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి
కేంద్ర నాయకులతో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి
కేంద్ర నాయకులతో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి
కేంద్ర నాయకులతో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending