Connect with us

News

హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్

Published

on

ఆదోని మండల పరిధిలోని పెద్ద హరివనం గ్రామంలో శుక్రవారం ఆదోని ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నిర్వహించిన ఈ తనిఖీల్లో 15 టిఫిన్ సెంటర్లు, హోటళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

​అక్రమ వినియోగంపై ‘6A’ కేసులు

​తనిఖీల్లో భాగంగా గృహ అవసరాల కోసం (Domestic) కేటాయించిన 34 ఎల్పీజీ సిలిండర్లను వ్యాపార అవసరాల కోసం అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్, టిఫిన్ సెంటర్ యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం (Essential Commodities Act) సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేసి, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

​అధికారుల హెచ్చరిక

​ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.

​డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సులు రద్దు చేస్తాం

​ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లకు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తున్నట్లు తేలితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

​వినియోగదారులకు సూచనలు:

  • సబ్సిడీ రద్దు: ‘దీపం’ పథకం కింద ఉచితంగా పొందిన సిలిండర్లను హోటళ్లకు అమ్మితే, సదరు వినియోగదారుల సబ్సిడీతో పాటు గ్యాస్ కనెక్షన్ కూడా రద్దు చేయబడుతుంది.
  • అదనపు వసూళ్లు: డెలివరీ బాయ్స్ అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసినా ఫిర్యాదు చేయవచ్చు.
  • ఫిర్యాదు చేయాల్సిన అధికారులు: సంబంధిత సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్, మండల తహసీల్దార్ లేదా జిల్లా పౌర సరఫరాల అధికారికి సంప్రదించాలి.
  • టోల్ ఫ్రీ నంబర్: ఫిర్యాదుల కోసం 1967 నంబర్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని విశ్వనారాయణ కళాశాల ఎదుట PDSU ధర్నా

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విశ్వనారాయణ కళాశాల ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు అఖండ, మండల అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విశ్వనారాయణ కళాశాల యాజమాన్యం ఒకే భవనంలో ఇంటర్, ఒకేషనల్, పల్లవి పారామెడికల్ కళాశాలలను నడుపుతోందని మండిపడ్డారు. పారామెడికల్ కళాశాలకు అనుమతి​ఎస్.కె.డి కాలనీ చిరునామాతో పొంది, అధికారుల కళ్లు గప్పి విశ్వనారాయణ కాలేజీ బిల్డింగ్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పారామెడికల్ బోర్డు అనుమతి పత్రం (పర్మిషన్ బోర్డు) కూడా లేకుండానే విద్యార్థుల వద్ద భారీగా ఫీజులు వసూలు చేశారని తెలిపారు. కాలేజీ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తరగతులు ప్రారంభించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.

విశ్వ నారాయణ కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్న పిడిఎస్యు నాయకులు

​అంతేకాకుండా తరగతులు జరుగుతున్న సమయంలోనే అదే భవనంపై నిర్మాణాలు (కన్స్ట్రక్షన్) చేపడుతున్నారని, దీనివల్ల విద్యార్థులకు ఏమైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న విశ్వనారాయణ కళాశాలపై ఇంటర్మీడియట్ బోర్డు, ఏపీ పారామెడికల్ బోర్డు అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పి.డి.ఎస్.యు మండల నాయకులు బసవ, విష్ణు, ముని, గోవర్ధన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

విశ్వ నారాయణ కళాశాల ఎదుట బైఠాయించిన పిడిఎస్యు నాయకులు
Continue Reading

News

ఆదోనికి 6 కొత్త ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఎంసిహెచ్ (MCH) ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మంగళవారం నూతనంగా మంజూరైన 102 ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాల ను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి రిబ్బన్ కట్ చేసి నూతన వాహనాలను ప్రారంభించారు.

మెడికల్ అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పార్థసారథి

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదోని నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం మొత్తం 6 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ నూతన వాహనాలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. కర్నూలు జిల్లాలోనే అత్యధిక ప్రసవాలు జరిగే ఆసుపత్రుల్లో ఆదోని ఎంసిహెచ్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రసవం అనంతరం బాలింతలను, పసిపాపలను సురక్షితంగా, ఉచితంగా ఇంటికి చేర్చేందుకు ఈ వాహనాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని తల్లులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పార్థసారధి

​ఈ కార్యక్రమంలో ఎంసిహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు లలితమ్మ, రేణు వర్మ, నాయకులు ఉపేంద్ర కుమార్, మధుసూదన్ శర్మ, ప్రశాంత్ కుమార్, వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

News

ఆదోని జిల్లా సాధన రిలే నిరాహార దీక్ష తాత్కాలిక విరామం

Published

on

కర్నూలు జిల్లా అదోనిలో గత 269 రోజులుగా ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు తాత్కాలికంగా విరామం లభించింది. ఆదోని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కే. మీనాక్షి నాయుడు విజ్ఞప్తి మేరకు జేఏసీ నాయకులు దీక్షా శిబిరాన్ని విరమించి వేదికను తొలగించారు.

దీక్ష శిబిరాన్ని తొలగిస్తున్న ఫోటో

దీక్ష విరమణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ — రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, సాంకేతిక అంశాల దృష్ట్యా తక్షణమే కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు ఆమోదం పొందిన వెంటనే, కొత్త నియోజకవర్గాలు మరియు జిల్లాల సంఖ్య పెరుగుతుందని ఆ సమయంలో ఆదోనిని జిల్లాగా ప్రకటించే అంశాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని లోకేష్ మరియు ఇన్‌చార్జ్ మంత్రి హామీ ఇచ్చారని మీనాక్షి నాయుడు వెల్లడించారు.

దీక్ష శిబిరం వద్ద మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు

జేఏసీ ప్రతినిధులు వై.పి. నాగరాజ్, సుజ్ఞానమ్మ, దేవశెట్టి ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ — గత 269 రోజులుగా పశ్చిమ కర్నూలు ప్రాంత ప్రజల కాంక్ష మేరకు సాగిన ఈ ఉద్యమానికి ఆదోనితో పాటు ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని జేఏసీ నాయకులు గుర్తుచేశారు. కుల, మత, రాజకీయ పార్టీల అతీతంగా వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, పత్రికా ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాలు ఈ దీక్షలకు పూర్తి మద్దతు తెలిపారుఅని ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కాదని 77 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పశ్చిమ ప్రాంత సమగ్ర అభివృద్ధి, మెరుగైన వైద్యం, తాగు/సాగు నీటి లభ్యత కోసమే ఈ పోరాటం ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా 269 రోజుల పాటు ఉద్యమానికి సహకరించిన ప్రజలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా ప్రతినిధులకు జేఏసీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

దీక్ష శిబిరాన్ని తొలగిస్తున్న జేఏసీ నాయకులు
Continue Reading

Trending