కర్నూలు జిల్లా ఆదోని ప్రజలకు వందల ఏళ్లుగా త్రాగునీరు అందించిన చారిత్రక రామజల చెరువులో నీరు అధికారులు , పాలకుల నిర్లక్ష్యంతో గత మూడేళ్లుగా నిరుపయోగంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ లో బసాపురం SS ట్యాంక్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో మున్సిపల్ అధికారులు త్రాగునీరు పూర్తి స్థాయిలో నిల్వ చేయలేకపోయారు.

రామజల చెరువు

వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా మార్చిలో అధికారుల దృష్టి రామజల పై పడింది. అందులో ఉన్న నీరు త్రాగడానికి పనికిరావని పరీక్షించిన నిపుణులు తెలియచేయడంతో వెంటనే నీరు ఖాళీ చేయడానికి మున్సిపల్ అధికారులు చేపట్టిన చర్యలకు ఎన్నికలు అడ్డంకి కావడంతో ఆ పని అక్కడే ఆగిపోయింది.

రామజల చెరువు ఆడుకునే స్థలం

ఎన్నికల కార్యక్రమాలు పూర్తయ్యాక ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కమిషనర్ రామ చంద్రారెడ్డి రామజల చెరువులో సుమారు 850 మిలియన్ లీటర్ల నీరు ఉన్నట్టు అంచనా వేసి ఆ నీరు ఖాళీ చేయడానికి సైపనింగ్ సిస్టం మరియు విద్యుత్ మోటార్ల ద్వారా రోజుకు 22 మిలియన్ లీటర్ల నీరు పంపింగ్ జరుగుతున్నదని,

రామజల చెరువు ఖాళీ చేస్తున్న ఫోటో

గత 12 రోజులుగా సుమారు 250 మీ. లీ నీరు ఖాళీ అవగా మిగిలిన 600 మిలియన్ లీటర్ల నీటిని మరో ముప్పై రోజుల్లోగా ఖాళీ చేస్తామని ఆతర్వాత LLC కెనాల్ నుండి పంపింగ్ ద్వారా చేరువులో నీరు నింపాక శుద్ధి పరిచిన నీటిని ఆదోని లోని 17 వార్డుల ప్రజలకు త్రాగునీటి సౌకర్యం అందించడానికి అవకాశం ఉందని మున్సిపల్ కమిషనర్ రామ చంద్రారెడ్డి తెలిపారు.

యూట్యూబ్ వీడియో
రామజల చెరువు మెట్లు
రామజల చెరువుకు ఖాళీ చేస్తున్న పీపులు
రామజల చెరువులో నీరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *