దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75 వ జయంతి కార్యక్రమం వేడుకలు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి పూలమాలు వేసి నివాళులర్పించరు. ఏరియా హాస్పిటల్ లలో పాలు బ్రెడ్లు పండ్లు రోగులకు అందజేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి విద్యకు పెద్దపీట వేసి ప్రోత్సహించారని ఆరోగ్యశ్రీ అనే సంక్షేమ పథకాన్ని పెట్టి ప్రతి పేదవానికి వైద్యం అందుబాటులో తెచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ గౌరవాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దేవా, చైర్ పర్సన్ బోయ శాంత, సీనియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.