ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేసిన శుభ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అభయాంజనేయ స్వామి గుడి నుంచి శ్రీనివాస భవన్ మీదుగా గవర్నమెంట్ ఆసుపత్రి వరకు వెళ్లి తిరిగి అభయాంజనేయ స్వామి గుడి వరకు విజయోత్సవ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ 48 స్థానాలు లో విజయం సాధించామని ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ అహంకారానికి బుద్ధి చెప్పారని ఢిల్లీ తీర్పుతో 12 ఏళ్లుగా పట్టిన గ్రహణం వీడిందని తెలిపారు.
ట్రాఫిక్ కి ఎటువంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్ సిఐ, టూ టౌన్, 3 టౌన్ సీఐ లు మరియు ఇతర సిబ్బంది ర్యాలీలో పాల్గొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కలిగించారు.

