News
ఆదోనిలో వైఎస్ఆర్సిపి భారీ నిరసన ర్యాలీ
డీఎస్సీ లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కర్నూలు జిల్లా ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ భవన్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యే పై ఘాటుగా స్పందించారు హైలెట్ కావడానికి ఇలా చేస్తూ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయినట్లు పరిగెత్తి వెళ్లడం ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి అంటే గాడిద పాలు తాగడం, దోషాలు వేయడం కాదని మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయాలని మైనారిటీ ఐటిఐ కాలేజ్, డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ పనులు పూర్తిచేసి సిబ్బంది తప్పిస్తే అది అభివృద్ధి అన్నారు. ఏమి చేతకాక చర్చలకు వస్తానని మాట్లాడడం సరైన పద్ధతి కాదని తెలిపారు.
ఈ ర్యాలీలో పట్టణ గౌరవాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి పట్టణ అధ్యక్షులు దేవా మహిళా నాయకులు మైనారిటీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News
తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు
హోస్పేట: 10.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 10 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1625.82 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 79.201 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 43022 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 42450 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1757 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 84.456 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
News
హై డ్రామా కు తెరలేపిన ఆదోని ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి హైడ్రామాకు తేరలైపోయారు. డీఎస్సీ నియామకాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని అవకతవకలు జరిగి ఉంటే బహిరంగ చర్చలకు సిద్ధమా అని వైసిపి నాయకులకు ఎమ్మెల్యే పార్థసారథి సవాల్ విసిరారు. దీనికి వైసిపి నాయకులు స్వీకరించి బహిరంగ చర్చలకు సిద్ధమని తెలపడంతో ఐదు గంటలకు వస్తాను అన్న పార్థసారధి కొద్ది దూరం వచ్చి తర్వాత పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు రోడ్డుపై హైడ్రామా చేసి వెన్ను తిరిగి వెళ్ళిపోయారు.
నిజంగా అవకతవకలు జరగలేదంటే మేము చర్చలకు ఎక్కడికైనా సిద్ధమని వైసిపి నాయకులు తేల్చి చెప్పారు. ఆదోని ఎమ్మెల్యే పై ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, వైఎస్ఆర్సిపి పట్టణ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి మండిపడ్డారు.
News
తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు
హోస్పేట: 09.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 09 (ఆదివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1624.74 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 75.644 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 40799 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 40500 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1525 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 81.538 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
-
News4 weeks ago
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News4 weeks ago
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News2 weeks ago
ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
-
News4 weeks ago
BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు
-
News2 weeks ago
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..
-
News3 weeks ago
ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ
-
News3 weeks ago
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
-
News3 weeks ago
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన