బిజెపి పార్టీలో చేరిన మైనార్టీ నాయకులు

కర్నూలు జిల్లా ఆదోని 11వ వార్డు వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్ వాసీం మరియు హవన్నపేట ముస్లిం మైనారిటి నాయకుడు ఖలీల్ అహ్మద్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సమక్షములో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి లో చేరిన కౌన్సిలర్ వాసీం మాట్లాడుతూ నాపైన నమ్మకంతో నా వార్డు ప్రజలు గెలిపించారని కానీ వైఎస్సార్ పార్టీలో నాకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నేను నెరవేర్చాలంటే, ఆదోని అభివృద్ధి ఎమ్మెల్యే పార్థసారథి తో మాత్రమే సాధ్యమవుతుందనే నమ్మకంతోనే నేను బిజెపి పార్టీలో చేరానని తెలిపారు. ఈ కార్యక్రమములో బిజెపి జిల్లా అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ, సింహం నాగేంద్ర, బిజెపి కౌన్సిలర్లు వెల్లాల లలితమ్మ, చిన్న,ఎవి సురేష్, నాయకులు ఉపేంద్ర, నాగరాజు గౌడ్, మల్లిక, మధు మొదలైన వారు పాల్గొన్నారు.

స్వీట్ తినిపించి పార్టీలోకి స్వాగతం పలికిన ఎమ్మెల్యే పార్థసారథి
ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన మైనార్టీ నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version