News
తుంగభద్ర నది నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి వాటిని వాడుకుందాం.. సీఎం చంద్రబాబుకు వినతి పత్రం
కర్నూలు జిల్లా రైతులు పంటలు పండక తీవ్రంగా నష్టపోతు వలసలు వెళ్తున్నారని. తుంగభద్ర నది నుంచి సుమారు 200 టీఎంసీ నీళ్ళు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి వీటిని వాడుకోవటం వల్ల కర్నూలు జిల్లా రైతులను ఆదుకున్నట్లు అవుతుందని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు కర్నూలు జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి పి.సాయిబాబ. అనంతరం సీఎం చంద్రబాబు కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా వినతిపత్రంలో పొందుపరిచిన విషయాలను వివరించారు.
- మంత్రాలయం నియోజకవర్గంలో అధిక భాగము వర్షాధార భూములే ఉనందున పంటలు పండక వలసలు వెళుతున్నారు. తుంగభద్ర డ్యాం నుండి ఆంధ్రప్రదేశ్ వాటాగా 734 క్యూసెక్కుల నీరు రావాల్సివుండగా, ఎల్.ఎల్.సి, ద్వారా కేవలం 250 క్యూసెక్కులు నీరు మాత్రమే వస్తున్నాయని తెలిపారు.
- సుమారు 200 టి.ఎం.సి ల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఈ నీటిని వాడుకోవడానికి గుంతకల్ బళ్ళారి రహాదారిలో హగరి వద్ద ఒక ప్రాజెక్టు నిర్మించి గ్రావిటీ ద్వారా వేదవతి ప్రాజెక్టుకు అనుసంధానం చేసి 60 టి.ఎం.సి. నీటిని కర్నూలు జిల్లాకు కేటాయిస్తే సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.
- ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో రిజర్వాయర్లు నిర్మించడం వల్ల కర్నూలు జిల్లా కు నీటి సౌలభ్యం ఏర్పడుతుందన్నారు.
- ఎల్.ఎల్.సి. కెనాలుకు 50కి.మి. వద్ద సిరిగేరి గ్రామం (కర్నాటక) నుండి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో 251 కి.మి. హానవాలు గ్రామము వరకు షార్ట్కట్ అండర్ గ్రౌండ్ పైపు లైన్ నిర్మించి ఎల్.ఎల్.సి.కి. అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు.
- కౌతాళం మండలం, మ్యాళిగనూరు వద్ద భారీ స్థాయిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తుంగభద్ర నదిపై నిర్మిస్తే సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
- ఆర్.డి.ఎస్. 4 టి.ఎం.సి.ల నీటి కొరకు నిర్మిస్తున్న ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.
- వేదవతి ప్రాజెక్టు నిర్మాణము కొనసాగించాలని కోరారు.
- కౌతాళం నుండి సి.బెళగల్లు వరకు తుంగభద్ర నదిపై యున్న 11 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు సామర్థ్యాన్ని పెంచి అదనంగా నీటి సౌకర్యము కల్పించాలని తెలిపారు.
- కర్నూలు జిల్లాలోని 7 నియోజకవర్గాలకు 150 టిఎంసి నీరు అవసరముండగా కేవలం 10 టిఎంసి నీరు మాత్రమే అందుతున్నదని దీనివల్ల కర్నూలు జిల్లా రైతులు వ్యవసాయరంగంలో పూర్తిగా నష్టపోతున్నారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




