విజయవాడ: యనమలకుదురు కట్ట మీద రోడ్డు వెంట మైనింగ్, పొల్యూషన్ శాఖల కు చెందిన రికార్డు లు ధ్వంసం చేసి రికార్డుల ను తగుల పెట్టారు సిబ్బంది. మంటలను చూసి స్థానికులు వారిని ప్రశ్నించడంతో వారు తెచ్చిన కారులో పరారయ్యారు. మైనింగ్, పొల్యూషన్ శాఖకుచెందిన అనేక పత్రాలు, హార్డ్ డిస్క్, క్యాసెట్ లు దగ్ధం కాలి బూడిద అయ్యాయి. పోలీసులు డ్రైవర్ నాగరాజును అదుపులోకి తీసుకొని ప్రశ్నించ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలు తో పత్రాలు దగ్దం చేశామని తెలిపినట్లు సమాచారం.