News
జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు..!
GST collection: దిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో (GST collections) సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్ నెలకు గానూ రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి..
గతేడాది ఏప్రిల్‌లో రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లు 12 శాతం మేర వృద్ధి నమోదైంది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం ఇదే తొలిసారి.
ఏప్రిల్ నెలకు గానూ రూ.1,87,035 కోట్లు వసూలు అవ్వగా.. అందులో సీజీఎస్టీ కింద రూ.38,440 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.47,412 కోట్లు, రూ.89,158 కోట్ల మేర ఐజీఎస్టీ (రూ.34,972 కోట్ల దిగుమతైన వస్తువుల మీద), సెస్సు కింద రూ.12,025 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ (Finance ministry) శాఖ తెలిపింది. 2022-23 మొత్తం ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.18.10 లక్షల కోట్లు వసూలయ్యాయని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 22 శాతం అధికమని కేంద్రం తెలిపింది.
రికార్డు స్థాయిలో జిఎస్టీ వసూళ్లు కావడం దేశ ఆర్థిక వ్యవస్థకు శుభవార్తగా ప్రధాన మంత్రి మోదీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. పిఐబి ప్రకటనను ట్విట్టర్‌లో కోడ్ చేస్తూ తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ…జిఎస్టీ వసూళ్లు పెరగడం విజయానికి సంకేతమని పేర్కొన్నారు..
ఏపీ 6.. తెలంగాణ 13 శాతం వృద్ధి..
తెలుగు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు కూడా స్వల్పంగా పెరిగాయి. గతేడాది ఏప్రిల్‌లో రూ.4067 కోట్ల వసూళ్లు సాధించిన ఆంధ్రప్రదేశ్.. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.4329 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే వసూళ్లు 6 శాతం మేర పెరిగాయి. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది రూ.4,955 కోట్లు సాధించగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.5,622 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు నమోదు చేసింది..
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్‌సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్‌సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




