కర్నూలు జిల్లా ఆదోని మండలం డణపురం గ్రామం మేక వంక సమీపంలో గురువారం రాత్రి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తూ పిడిఎస్ రైస్ తరలిస్తున్న లారీని సీజ్ చేశారు. డ్రైవర్ నాగరాజు క్లీనర్ మల్లికార్జున ను పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి కర్ణాటక రాష్ట్రం రాయచూరు పట్టణానికి ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించినట్లు ఎస్సై నాగేంద్ర తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పంచనామా చేసిన రెవెన్యూ అధికారులు మొత్తం సుమారు 12 టన్నుల బియ్యం ఉన్నాయని వాటిని సీజ్ చేసి రేషన్ బియ్యాన్ని స్టాక్ పాయింట్ గోడౌన్ కు తరలిస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్ర తెలిపారు.