హాస్టల్ సమస్యలు, నాణ్యమైన విద్య కోసం పోరాడుదాం: ఎస్ఎఫ్ఐ పిలుపు

ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, నాణ్యమైన విద్య విద్యార్థుల హక్కు అని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) స్పష్టం చేసింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌ను ఎస్ఎఫ్ఐ నాయకత్వ బృందం సందర్శించి, అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నరు.

ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌ను ఎస్ఎఫ్ఐ నాయకత్వ బృందం సందర్శించిన ఫోటో

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భగత్ రవి మాట్లాడుతూ, నేటి యువత (జెన్ జీ) పోరాట స్ఫూర్తితో తమ హక్కుల సాధనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తీవ్ర కరువు, వలసలు అధికంగా ఉండే కర్నూలు వంటి ప్రాంతాల్లో ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పడంతో పాటు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు (స్కిల్ సెంటర్లు) ఏర్పాటు చేసి యువతకు మెరుగైన ఉపాధి, విద్యా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలపై రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఆదోని పట్టణ అధ్యక్షుడు సంజయ్ తదితరులు పాల్గొన్నారు.