భగత్ సింగ్ సుందరయ్య ఫౌండేషన్‌కు గుడిసె కృష్ణమ్మ ఆర్థిక సాయం

కర్నూలు జిల్లా ఆదోని లో అత్యవసర పరిస్థితుల్లో పేద, సామాన్య ప్రజలకు నిరంతరం అండగా నిలిచేందుకు భగత్ సింగ్ సుందరయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మరో అంబులెన్స్‌కు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ తనవంతుగా రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.

భగత్ సింగ్ సుందరయ్య ఫౌండేషన్‌కు ఆర్థిక సహాయం అందిస్తున్న గుడిసె కృష్ణమ్మ

ఈ సందర్భంగా గుడిసె ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ.. నిరుపేదలకు సకాలంలో వైద్య సాయం అందించేందుకు ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రజల ప్రాణాలను కాపాడే ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించాలని ఆమె పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం ఫౌండేషన్ చేపట్టే ప్రతి సేవా కార్యక్రమానికి తన మద్దతు, సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు మరియు పలువురు నాయకులు పాల్గొని, అంబులెన్స్ ఏర్పాటుకు తోడ్పాటు అందించిన శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.