క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

​ఆదోని, ఏప్రిల్ 13: పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్‌కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం … Read more

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

ఆదోని, ఏప్రిల్ 03: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ​ఘటన వివరాలు: ​శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో … Read more

ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామం లో గత నెల 18వ తేదీ తండ్రి ఆస్తి పంచడం లేదని కత్తి తో దాడి చేసి అడ్డొచ్చిన తల్లిని కొట్టి తండ్రి సెల్ తో ఫోన్ పే ద్వారా 2 లక్షలు తన అకౌంట్ లో వేసుకొని తండ్రి బుల్లెట్ వాహనం తో పరారైన వేణుగోపాలను ఇస్వి పోలీసులు చాగి బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష 92 వేల నగదు, … Read more

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

ఆదోనిలో అధికారులు మెరుపు దాడులతో విరుచుకుపడ్డారు. సామాన్యుడి పొయ్యి వెలగాల్సిన డొమెస్టిక్ గ్యాస్‌ను.. హోటళ్లలో వాడుతూ సొమ్ము చేసుకుంటున్న గ్యాస్ మాఫియా గుట్టు రట్టు చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో హోటల్ యజమానుల ఆటలు సాగనివ్వమని సివిల్ సప్లై అధికారులు తేల్చి చెప్పారు. నిబంధనలను తుంగలో తొక్కి, తక్కువ ధరకు వచ్చే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్నారనే ఫిర్యాదుతో అధికారులు ఒక్కసారిగా దాడులకు దిగారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో DSO రాజా … Read more

హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్

ఆదోని మండల పరిధిలోని పెద్ద హరివనం గ్రామంలో శుక్రవారం ఆదోని ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నిర్వహించిన ఈ తనిఖీల్లో 15 టిఫిన్ సెంటర్లు, హోటళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ​అక్రమ వినియోగంపై ‘6A’ కేసులు ​తనిఖీల్లో భాగంగా గృహ అవసరాల కోసం (Domestic) కేటాయించిన 34 ఎల్పీజీ సిలిండర్లను వ్యాపార అవసరాల కోసం అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్, … Read more

ఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!

​కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో ఒకే రోజు వరుస దొంగతనాలకు పాల్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేశారు. నగదు, బంగారంతో ఉడాయించారు. ​​కత్తి ఆంజనేయులు కాలనీ నివాసముంటున్న రాము అనే బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. హాస్పిటల్ లో తండ్రి ఆపరేషన్ కోసం తెచ్చుకున్న డబ్బులను బీరువా పగులగొట్టి 1,50,000 రూపాయల నగదు, 6 గ్రాముల బంగారం, 30 తులాల వెండి వస్తువులను అపహరించారు. … Read more

సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట

ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు: ఈ కార్యక్రమంలో సహకార సంఘాల … Read more

పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ

ఆదోని, ఫిబ్రవరి 18: ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే?  కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు … Read more

నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి

​ఆదోని రూరల్, ఫిబ్రవరి 18: కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు. ​ఘటన వివరాలు: ​పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి … Read more

మహిళా భద్రతపై అవగాహన సదస్సు

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరియు ఆదోని డి‌ఎస్‌పి శ్రీ హేమలత ఆదేశాల మేరకు, ఆదోని మండలం ధనాపురం గ్రామంలో మహిళా భద్రతపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇస్వి పోలీస్ సిబ్బంది పాల్గొని గ్రామస్థులకు పలు కీలక సూచనలు చేశారు. అవగాహన కల్పించిన అంశాలు: ఈ సందర్భంగా సీఐ (CI) నల్లప్ప మరియు ఇస్వి ఎస్ఐ (SI) మహేష్ కుమార్ మాట్లాడుతూ, మహిళలు మరియు … Read more