వచ్చే ఎన్నికల్లో టిడిపి పార్టీ భూస్థాపితం అవుతుంది.. ఆదోని ఎమ్మెల్యే

వచ్చే ఎన్నికల్లో టిడిపి పార్టీ భూస్థాపితం అవుతుందని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని బోయగెరి కి చెందిన టిడిపి జనసేన కాంగ్రెస్ పార్టీల నుంచి సుమారు 100 కుటుంబాలు సీనియర్ నాయకుడు ఆంజనేయులు నాయకత్వ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరమన్నారు.

వర్షాలు లేక ఎండిపోతున్న పంటలనకు ట్యాంకర్ల ద్వారా నీళ్లతో తడుపుతున్న రైతు

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మధిర గ్రామంలో సిపిఎం ప్రతినిధి బృందం పొలాలలో పంటలను పరిశీలించారు. వర్షాలు లేక ఎండిపోతున్న మిరప, ఉల్లి పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు పొలాలకు తడుపుతున్న రైతు రామాంజనేయులు పొలాన్ని పరిశీలించారు. ఆ రైతును అడిగి వివరాలు తెలుసుకొన్నారు రైతు రామాంజనేయులు మాట్లాడుతూ ఒకసారి ఎకరా పొలం తడపాలంటే 30 వేల రూపాయలు ఖర్చవుతుందని, ఏడెకరాలకు ఒకసారి 2 లక్షల పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపాడు. సిపిఎం రాష్ట్ర […]

కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై పోలీసుల దాడులు

కర్నూలు జిల్లా ఆదోని మండలం జి.హోసల్లి గ్రామం సమీపంలో శుక్రవారం రోజు మోటార్ సైకల్ పై కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి కౌతాలం మండలం, తోవి గ్రామానికి చెందిన బోయ పాండవగల్లు ఊసేని ని అరెస్టు చేసి అతను నుండి 1152 (12 బాక్స్ లు) ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లను, మోటార్ సైకల్ ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి మద్యం ప్యాకెట్లను మోటార్ సైకిల్ ని సీజ్ చేసినట్లు […]

ముఖ్యమంత్రి కి బ్రాహ్మణ సమస్యలు వివరించిన రాష్ర్టబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెల్లాల మధుసూదన శర్మ

గురువారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు పథకం ద్వారా చేతివృత్తుల వారికి అండగా నిలవడానికి ఎమ్మిగనూరు పట్టణానికి వచ్ఛిన సందర్భంగా ఆపన్నప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వెల్లాల మధుసూదనశర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి రాష్ట్రములోని బ్రాహ్మణ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మధుసూదనశర్మ తో మాట్లాడుతూ ఎలాంటి సహాయం బ్రాహ్మణులకు అవసరమవుతుంది అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సమస్యలను […]

బొలెరో వాహనం, పాలవ్యాన్, స్కూటర్కు ఢీ

కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్ గ్రామ సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి పాల వ్యాన్ను మరియు స్కూటర్ను ఢీ కొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకెళ్తే నరసరావుపేటకు చెందిన ఓనర్ రవితేజ, డ్రైవర్ సింహాద్రి మెడిసిన్ వేసుకుని ఆదోనికి వస్తుండగా అదుపుతప్పి పాల వ్యాను, స్కూటర్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నరసరావుపేటకు చెందిన రవితేజ డ్రైవర్ సింహాద్రి కి, అమరావతికి చెందిన పాల వ్యాన్ […]

ఎస్ ఎస్ ట్యాంక్ లో ఉన్న ముసలి చిక్కింది

తాగునీటి కోసం నిర్మించిన ఎస్ ఎస్ ట్యాంకులో కొన్ని నెలలుగా ముసలి సంచారం. పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం జాలరు చేతిలో చిక్కింన ముసలి.. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకోసం శివార్లలో సమ్మర్ స్టోరేజ్ టాంక్ నిర్మించారు.. ఇక్కడ తుంగభద్ర దిగువ కాలువ నుంచి సమ్మర్ స్టోరేజ్ టాంక్ లోకి నీటి నింపి ఇక్కడి నుండే పట్టణ ప్రజా లకు తాగునీటిని సరఫరా చేస్తారు. గత ఏడాది క్రితం సమ్మర్ […]

శ్రీశ్రీశ్రీ సద్గురు చింతల మునిస్వామి 40వ ఆరాధన మహోత్సవము

కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామం లో శ్రీశ్రీశ్రీ సద్గురు చింతల మునిస్వామి 40వ ఆరాధన మహోత్సవములో యువనేత వై జయ మనోజ్ రెడ్డి పాలుగోన్నరు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని లో క్రికెట్ బెటింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు ఇస్మాయిల్ భాష, శివమూర్తి, పింజరి హుస్సేన్ అను నిర్వాహకులను త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 8 లక్షల 25 వేల 5 వందలు రూపాయల నగదు, 8 సెల్ ఫోన్ లు, 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి శివ నారాయణస్వామి తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు ఆదోని ఎమ్మిగనూరు బైపాస్ వద్ద ఇండియా బంగ్లాదేశ్ […]

క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై పోలీసుల ఉక్కు పాదం

◆ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు 5 మంది అరెస్ట్..◆ సుమారు 2 లక్షలు నగదు, ఐదు సెల్ ఫోన్లు, 25 లీటర్ల నాటు సారా స్వాధీనం.. కర్నూలు జిల్లా ఆదోనిలో 5 మంది క్రికెట్ బెట్టి నిర్వాహకులను వన్ టౌన్ సిఐ విక్రమసింహ అరెస్టు చేశారు. సిఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు డిఎస్పి శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ నగర్ కు […]

ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం

ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం అని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయలో ఆర్కియాలజీ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మరియు జామియా మసీద్ పెద్దలరో ప్రాచీన కట్టడాలపై సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 500 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రాచీన కట్టడాలైన మసీదును అందరం కలసి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. మసీద్ పరిసరాల ప్రాంతాల్లో జరుగుతున్న […]

Back To Top