తెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో ఒకే వేదికపై

వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డితెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో ఒకే వేదికపై కనిపించనున్నారు. జులై మూడో వారంలో మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ విషయాన్ని కమ్మ మహాసభ నిర్వాహకుడు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ ఈ ప్రపంచ కమ్మ మహాసభ వేడుకలకు వేదికగా నిలవనుంది.

ఎన్నికలలో పనిచేసిన సిబ్బందికి 1నెల జీతం బోనస్..

చంద్రబాబు నాయుడు ఉదారత..ఎన్నికలలో పనిచేసిన సిబ్బందికి 1నెల జీతం బోనస్ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీనిపట్ల ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.. మాములుగా అయితే పనిచేసిన 45 రోజులకు రోజుకు 120 రూపాయలు లెక్కగట్టి జీతం ఇస్తారు.. కానీ వారి గ్రెడ్ ను బట్టి వారికి నెల జీతం బోనస్ గా ఇచ్చింది..

అన్న క్యాంటీన్ లు పునరుద్ధరణకు రూ.189 కోట్లు.

అమరావతి: పేదల ఆకలి బాధలు తీర్చే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు తక్షణం రూ.189.22కోట్లు అవసరమని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అంచనాలు వేసింది. ఆర్థికశాఖకు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం రాగానే పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో 183 క్యాంటీన్ల పునరుద్ధరణకు రూ.189.22 కోట్లు అవసరమని ఇంజినీర్లు అంచనాలు వేసి ఆర్థికశాఖకు నిధుల కోసం ప్రతిపాదించారు.

పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన

అమరావతీ : పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1న ఉ.6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని, వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకు స్పష్టం చేసింది.

దుల్హన్ పథకం అమలు

వివాహ పథకం యొక్క ప్రయోజనాలుఆంధ్రప్రదేశ్‌లో దుల్హన్ వివాహ పథకాన్ని పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా వివరించబడ్డాయి: మైనారిటీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయికి వివాహ సమయంలో కుటుంబ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ పథకం ఆర్థిక సహాయం రూపంలో ప్రయోజనాలను మంజూరు చేస్తుంది.ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం అమ్మాయి వివాహ వేడుక కోసం రూ.1,00,000 అందిస్తుంది.దరఖాస్తుదారు వివాహ తేదీ నుండి ఒక నెల ముందు పథకం కోసం దరఖాస్తు చేయాలి.అర్హత ప్రమాణంఈ వివాహ పథకం కోసం […]

జై భీమ్ రావ్ భారత్ పార్టీకు రాజీనామా

2024 ఎమ్మెల్యే ఎన్నికల్లో జై భీమ్ రావ్ భారత్ పార్టీ నుండి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గనికి ఎమ్మెల్యేగా మాజీ కౌన్సిలర్ కల్లుబోతుల రంగన్న పోటీ చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన ప్రజాదరణ పొందలేక ఓటమి చెవి చూశారు మాజీ కౌన్సిలర్ కల్లుబోతుల రంగన్న. కొన్ని అనివార్య కారణాలవల్ల జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధిష్టానానికి చరవాణి ద్వారా రాజీనామను తెలిపినట్లు విలేకరులకు సమాచారం అందించారు. పార్టీ పెద్ద వారు సానుకూలంగా స్పందించరని తెలిపారు. […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 27-06-24 పత్తి అత్యధికంగా ₹. 7639 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4212/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6220 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4619/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5330/- రూపాయలు కనిష్ట ధర ₹. 2120/- రూపాయలు పలికింది.

కన్న బిడ్డను చంపుకున్న కసాయి తల్లి

కర్నూలు జిల్లా కోసిగి మండలం దేవరబెట్టు గ్రామంలో ఓ తల్లి పది నెలల కొడుకును గొంతు నలిపి చంపి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన బుధవారం తుంగభద్ర పాత రైల్వే స్టేషన్ స మీపంలో చోటుచేసుకుంది. దేవరబెట్టు గ్రామానికి చెందిన కొండ రామాంజనేయులు ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన హనుమంతమ్మకు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది వీరికి ఒక కుమార్తె ఒక కొడుకు ఉన్నారు గత కొన్ని నెలలుగా హనుమంతమ్మ మానసిక […]

పిల్లలంటేనే ఉత్సాహానికి సంకేతం.. సబ్ కలెక్టర్

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదామని పిలుపునిచ్చారు సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ.కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ ఆర్ట్స్ కాలేజీ సెబ్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన జరిగే నష్టాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ. తాత్కాలిక ఉపశమనం కోసం భవిష్యత్తు అంధకారం చేసుకోకూడదని విద్యార్థులకు సూచించారు. పిల్లలంటేనే ఉత్సాహానికి సంకేతం. వారు ఎలాంటి సాహసాలకైనా వెనుకడుగు వేయరు. కానీ […]

Back To Top