కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్న బసవరాజు (22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్ర లేచి పక్క గదిలో ఫ్యాన్ కు వేలాడుతున్న భర్తను చూసిన భార్య కవిత వెంటనే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపింది. రెండు నెలల క్రితమే హత్రి బెలగల్ గ్రామానికి చెందిన కవితకు బసవరాజుకు వివాహమైంది. వివాహమైన రెండు నెలలకే ఇలా జరగడంతో సంతెకుడ్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. […]
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఉదయం రాయ నగర్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ట్రైన్ కి పడి మృతి చెందినట్లు సమాచారం. అక్కడ నివసిస్తున్న స్థానికులు సమాచారం అందించారు. అక్కడే ఉన్న సైకిల్. వైట్ కలర్ టోపీ, అంత్రాలు, వాటర్ ప్యాకెట్లతో కర్ణాటక లిక్కర్ మృతి చెందిన వ్యక్తివిగా అనుమానంతో ఇవన్నీ కూడా పక్కన తీసిపెట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 07.07.2024
పెన్షన్ పంపిణీ చేయాల్సిన నగదు చోరీ
కర్నూలు జిల్లా ఆదోని 27వ వార్డ్ సచివాలయంలో పెన్షన్ పంపిణీ చేయాల్సిన నగదు చోరీ అయినట్లు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సచివాలయ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. సచివాలయ ఉద్యోగి రవికుమార్ తెలిపిన వివరాల మేరకు పెన్షన్లు ఇవ్వడానికి 17 లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేసుకొని వచ్చి సచివాలయంలో లెక్కపెడుతుండగా సుమారు ఉదయం 12 గంటల 10-15 నిమిషాల ప్రాంతంలో చెవిటి మూగ వ్యక్తి సచివాలయం లోకి వచ్చి మాటల్లో పెట్టి 50వేలు తీసుకొని పరాలయాడని […]
ఆదోని కూటమిలో కొమ్ములాటలు.. వైరల్ గా మారిన వీడియో..
ఎన్నికల్లో కష్టపడిన టిడిపి నాయకులను పట్టించుకోవడంలేదని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిని ప్రశ్నించారు నాయకులు. ఎన్నికల ముందు 10% శాతం నేనే అయితే 90% మీనాక్షి నాయుడు ఎమ్మెల్యే అని చెప్పిన పార్థసారథి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కూటమి పల్లకి మోసిన బాధితుడు TNTUC కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ మల్లికార్జున ఏకంగాకూటమి పల్లకి మోసి మోసపోయిన కార్యకర్త బాధితుల ఐక్యవేదిక విన్నపం ఏమనగా అని ఎమ్మెల్యేను పార్థసారధిని ప్రశ్నించారు. సోషల్ […]
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 29.06.2024
తెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో ఒకే వేదికపై
వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డితెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో ఒకే వేదికపై కనిపించనున్నారు. జులై మూడో వారంలో మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ విషయాన్ని కమ్మ మహాసభ నిర్వాహకుడు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ ఈ ప్రపంచ కమ్మ మహాసభ వేడుకలకు వేదికగా నిలవనుంది.
ఎన్నికలలో పనిచేసిన సిబ్బందికి 1నెల జీతం బోనస్..
చంద్రబాబు నాయుడు ఉదారత..ఎన్నికలలో పనిచేసిన సిబ్బందికి 1నెల జీతం బోనస్ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీనిపట్ల ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.. మాములుగా అయితే పనిచేసిన 45 రోజులకు రోజుకు 120 రూపాయలు లెక్కగట్టి జీతం ఇస్తారు.. కానీ వారి గ్రెడ్ ను బట్టి వారికి నెల జీతం బోనస్ గా ఇచ్చింది..
అన్న క్యాంటీన్ లు పునరుద్ధరణకు రూ.189 కోట్లు.
అమరావతి: పేదల ఆకలి బాధలు తీర్చే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు తక్షణం రూ.189.22కోట్లు అవసరమని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అంచనాలు వేసింది. ఆర్థికశాఖకు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం రాగానే పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో 183 క్యాంటీన్ల పునరుద్ధరణకు రూ.189.22 కోట్లు అవసరమని ఇంజినీర్లు అంచనాలు వేసి ఆర్థికశాఖకు నిధుల కోసం ప్రతిపాదించారు.
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 28.06.2024