Category: News

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నంద్యాల జిల్లాలో పర్యటన

తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 09.08.2024 నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ దాడిలో హత్యకు గురైన పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం చేరుకుని పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు, అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఓర్వకల్లు […]

అక్రమ మద్యం తరలింపుపై సెబ్ అధికారుల దాడులు

కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఆదేశాలతో ఎన్ఫోరసెమెంట్ సూపరింటెండెంట్ ఎస్. రవికుమార్ పర్యవేక్షణ లో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై ఆదోని సెబ్ పోలీసులు, డిటీఎఫ్ కర్నూల్ సిబ్బంది కలసి గురువారం దాడులు నిర్వహించారు.కర్నూలు జిల్లా కౌతాళం మండలం రౌడురు గ్రామం సమీపంలో మూకన్న అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతనివద్ద నుండి 4బాక్స్ లు (90 ml 384 టెట్రా ప్యాకెట్లు), ఒక స్కూటర్ సీజ్ చేశారు సెబ్ పోలీసులు. ఈ దాడులలో […]

చేనేతలకు 200 యూనిట్ల ఉచిత

ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలలో మరో రెండు అమలుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. చేనేతలకు జీఎస్టీ రీయంబర్స్మెంట్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలుకి గ్రీన్ సిగ్నల్.

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు

కర్ణాటక: తుంగభద్ర: 08.08.2024 8amతుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..పూర్తి స్థాయి నీటిమట్టనికీ చేరిన డ్యామ్..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు..ఇన్ ఫ్లో : 57819 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 59839 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1632.45 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 103.580 టీఎంసీలు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం: 07 08 2024, 7amపూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన శ్రీశైలం డ్యాం..జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,30,632 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,74,309 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 882.60 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 202.5056 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

వయనాడ్ కోసం ప్రభాస్ రూ.2 కోట్లు

కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల పట్ల రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.2 కోట్లు విరాళమిచ్చినట్లు ఆయన టీమ్ ప్రకటించింది. ఇప్పటికే అల్లు అర్జున్ రూ.25 లక్షలు, చిరంజీవి, రామ్చరణ్ కలిపి రూ. కోటి ఇచ్చారు. అటు సూర్య, విక్రమ్, మమ్ముట్టి, మోహన్లాల్, నయనతార వంటి స్టార్స్ కూడా కేరళకు అండగా నిలిచారు.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం: 07 08 2024, 3pmశ్రీశైలం జలాశయానికి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన శ్రీశైలం డ్యాం..జలాశయం 10 గేట్లు 12అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,10,064 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,72,103 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 883.00 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 205.2288 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

నాతో పాటు అన్ని వాహనాలకు ఫైన్ వేయండి.. అడ్వకేట్ నాగేంద్ర

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ట్రాఫిక్ జామ్ చేస్తూ ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇష్టానుసారం పార్కింగ్ చేయడంతో Mro ఆఫీస్ , కోర్టు కు , isvi స్టేషను కు వెళ్లే దారి లేక సామాన్యు ప్రజలు, లాయర్లు, ఇబ్బందులకు గురయ్యారు. సామాన్యులకు ఫైన్ లతో చుక్కలు చూపిస్తున్న పోలీసులు ప్రజా ప్రతినిదులు , అధికారుల వాహనాల పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలన్నరు లాయర్ నాగేందర్. సబ్ కలెక్టర్ ఆఫీస్ లో […]

Back To Top