Category: News

వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబళం గ్రామం, ఎస్సీ కాలని లో  వరకట్న వేధింపులు తట్టుకోలేక వివాహిత బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య  చేసుకోవడంతో గ్రామం లో విషాదం చోటు చేసుకుంది.మృతురాలి తండ్రి హనుమంతు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని మండలం , పెద్దతుంబళం గ్రామంలో నక్కల హనుమంతు , బుజ్జమ్మ ల కుమార్తె అనూష నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి శాంతరాజు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి శాంతరాజు తల్లితండ్రులకు […]

హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ శిక్ష

కర్నూలు జిల్లా ఆదోని లో ముద్దాయి కురువ నాగేష్ కు హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష మరియు రూ.1,500/- లు జరిమాన విధిస్తూ తీర్పును వెల్లడించారు రెండవ అదనపు జిల్లా  జడ్జ్ టి.జె. సుధా. మద్యానికి బానిసై పనికి పోకుండా తిరుగుతుండడంతో భార్య జయలక్ష్మి పనికి పొమ్మని మందలించదాంతో 20.02.2024  నాగేశ్ రాత్రి అందరూ నిద్ర లో ఉన్నపుడు గొడ్డలితో భార్య కురువ జయలక్ష్మీని నరికి హతమార్చిడు. ఘటనకు సంబందించి కురువ జయలక్ష్మీ […]

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో ప్రై మినిస్టర్ రైసింగ్ ఆఫ్ స్కూల్స్సెంట్రల్  స్కీం  ద్వారా 63 లక్షలతో ZP పాఠాశాల అదనపు గదులకు కేంద్ర ప్రభుత్వ NREGS పథకం ద్వారా 10 లక్షలతో గ్రామములో CC రోడ్డు పనులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు.          ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ పెద్ద తుంబలం గ్రామంలోనే కాకుండా మండలంలో అన్ని గ్రామాల్లో స్కూలకు అదనపు […]

హెచ్ పి గ్యాస్ సిలిండర్లు సీజ్

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివన గ్రామంలో కర్ణాటక నుంచి హెచ్.పీ గ్యాస్ సిలిండర్లను తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకొని 50 సిలిండర్లను సీజ్ చేశారు. కర్ణాటక నుంచి తెచ్చి గ్యాస్ సిలిండర్లను డిస్ట్రిబ్యూట్ చేయొద్దని ఎన్నిసార్లు హెచ్చరించిన వినకపోవడంతో రెవెన్యూ అధికారులకు పోలీసులకు డిస్ట్రిబ్యూటర్ ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.

నలుదిక్కుల ప్రధాన ముఖ్యమైన వార్తలు

◆ ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు పై బిజెపి కసరత్తు, అమిత్ షా నివాసంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై మీటింగ్.. ప్రధాని విదేశీ పర్యటన తర్వాతే కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉండే అవకాశం..◆ కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య లోపారిక ఒప్పందం జరిగిందన బండి సంజయ్..అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపణ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బిజెపి గెలుపు ఖాయం అన్న ధీమా..◆ బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్న హరీష్ రావు, కామారెడ్డి లో […]

ఆదోని బిజెపి నాయకుల విజయోత్సవ ర్యాలీ

ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగురవేసిన శుభ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అభయాంజనేయ స్వామి గుడి నుంచి శ్రీనివాస భవన్ మీదుగా గవర్నమెంట్ ఆసుపత్రి వరకు వెళ్లి తిరిగి అభయాంజనేయ స్వామి గుడి వరకు విజయోత్సవ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ 48 స్థానాలు లో విజయం సాధించామని ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ అహంకారానికి బుద్ధి చెప్పారని […]

కేంద్ర బడ్జెట్ కు నిరసనగా బడ్జెట్ పత్రాలు దగ్ధం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రధాన రహదారిపై బడ్జెట్ పేపర్లను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.లింగన్న మాట్లాడుతూ రైతులు, కూలీలు, కార్మికులకు వ్యతిరేకంగా ఉందని, ఉపాధి హామీ, ఆహార భద్రత, గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయింపులు లేవని, పేదలకు వ్యతిరేకమైన […]

రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సబ్ కలెక్టర్

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ హోళగుంద మండలం రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నికైన పెద్ద హ్యట గ్రామంలో జరుగుచున్న రీసర్వే ప్రక్రియను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పరిశీలించిన అనంతరం రీ సర్వే సంబంధించిన అంశాలపై చిన్న హ్యట గ్రామ సచివాలయంలో అధికారులతో చర్చించరు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిజాముద్దీన్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, మండల సర్వేయర్ (ఇన్చార్జి) శ్రీనివాసులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

బ్రిడ్జి పైనుంచి కింద పడి వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా ఆదోని మాసా మసీద్ కాలనీకి చెందిన సయ్యద్ నూర్ (55) కొత్త ఓవర్ బ్రిడ్జి పై నుండి ప్రమాద వశాత్తు కింద పడటంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గుర్తించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది క్షతగాత్రుడు అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ప్రాంగణంలో రోదనలు మిన్నంటకున్నాయి, వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. తోపుడు బండి పై కూరగాయల వ్యాపారం […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 03-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7365/- రూపాయలు కనిష్ట ధర ₹. 4099/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6089/- రూపాయలు కనిష్ట ధర ₹. 3279/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5722/- రూపాయలు కనిష్ట ధర ₹.4000/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు […]

Back To Top