కర్నూలు జిల్లా పరిధిలోని ఆదోని 1, ఆదోని 2 మండలాల్లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. జెడ్పీటీసీ స్థానాల్లో ఆదోని 1 మండలంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బోయ ఉరుకుందప్ప 3,860 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించగా, ఆదోని 2 మండలంలో టీడీపీ అభ్యర్థిని కురువ శంకరమ్మ 6,383 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఆదోని 1 మండలం పరిధిలోని మొత్తం 14 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 8 స్థానాలను, వైఎస్సార్సీపీ 6 స్థానాలను కైవసం చేసుకున్నాయి. టీడీపీ తరపున దిబ్బనకల్ స్థానంలో పద్మ 275 ఓట్లతో, సాంబగల్లు స్థానంలో పద్మ 275 ఓట్లతో, గోనభావి స్థానంలో హేమలత 28 ఓట్లతో, సదాపురం స్థానంలో పద్మ 275 ఓట్లతో, ఆరేకల్ స్థానంలో సంధ్య 40 ఓట్లతో, బైచిగేరి స్థానంలో బోయ బాలకృష్ణ 272 ఓట్లతో, విరూపాపురం స్థానంలో వీరేంద్ర 83 ఓట్లతో, పెసలబండ స్థానంలో రాముడు 309 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైఎస్సార్సీపీ తరపున చిన్నపెండేకల్ స్థానంలో ఆదిలక్ష్మి 116 ఓట్లతో, మండగిరి 1 స్థానంలో వీరారెడ్డి 108 ఓట్లతో, మండగిరి 2 స్థానంలో శేషావతి 270 ఓట్లతో, బసరకోడు స్థానంలో చిన్న సోమలింగ 113 ఓట్లతో, దొడ్డనగేరి స్థానంలో సుజాత 125 ఓట్లతో, ఇస్వి స్థానంలో మహాదేవప్ప 8 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


మరోవైపు ఆదోని 2 మండలంలోని మొత్తం 17 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు 13 స్థానాల్లో (టీడీపీ 12, బీజేపీ 1), వైఎస్సార్సీపీ అభ్యర్థులు 4 స్థానాల్లో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థులలో బసాపురం స్థానంలో భంగి వీరాజమ్మ 390 ఓట్లతో, బల్లేకల్లు స్థానంలో చిన్నలక్ష్మిరెడ్డి 270 ఓట్లతో, హానవాలు స్థానంలో షాహిన్ బేగం 365 ఓట్లతో, చిన్నహరివాణం స్థానంలో సులోచన 1,283 ఓట్లతో, నారాయణపురం స్థానంలో చంద్రశేఖర్ 551 ఓట్లతో, జి.హోసల్లి స్థానంలో గోవిందమ్మ 85 ఓట్లతో, గణేకల్లు స్థానంలో చిట్టెమ్మ 82 ఓట్లతో, కుప్పగల్లు స్థానంలో పాతింటి శేఖర్ 402 ఓట్లతో, పెద్దతుంబలం 1 స్థానంలో కొండ కాశిమయ్య 444 ఓట్లతో, పెద్దతుంబలం 2 స్థానంలో ముల్లా రజియా బేగం 180 ఓట్లతో, మదిరే స్థానంలో సంగీపోగు రాజు 150 ఓట్లతో, పెద్దహరివాణం 1 స్థానంలో రాజమ్మ 255 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే కూటమి భాగస్వామి అయిన బీజేపీ తరపున దనపురం స్థానంలో నిత్యానంద 150 ఓట్లతో విజయం సాధించారు. వైఎస్సార్సీపీ తరపున పెద్దహరివాణం 2 స్థానంలో లావణ్య 225 ఓట్లతో, నాగనాథనహళ్లి స్థానంలో కృష్ణకుమార్ 80 ఓట్లతో, సంతెకుడ్లూరు స్థానంలో చాంద్‌బీ 183 ఓట్లతో, జాలమంచి స్థానంలో ధనుంజయ 159 ఓట్ల ఆధిక్యంతో విజయం దక్కించుకున్నారు.
