ఆదోని మండలాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

రెండు మండలాల్లో కలిపి 60,311 మంది ఓటు హక్కు వినియోగం ◆మండలం-1లో 62.65%, మండలం-2లో 69.32% నమోదు ◆ 101 కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు మధ్య ముగిసిన ప్రక్రియ..

వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
ఓటు హక్కును వినియోగించుకుంటున్న గ్రామస్తులు

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలోని ఆదోని మండలం-1, మండలం-2 స్థానిక సంస్థల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మండలం-1 పరిధిలోని 14 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి, అలాగే మండలం-2 పరిధిలోని 17 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి అధికారులు పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసే సమయానికి మండలం-1లో 62.65 శాతం, మండలం-2లో 69.32 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఓటు హక్కును వినియోగించుకుంటున్న గ్రామస్తులు

విస్తృత ఏర్పాట్లు.. పటిష్ట బందోబస్తు : రెండు మండలాల్లోని మొత్తం 90,902 మంది ఓటర్ల కోసం అధికారులు 101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 479 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు తాగునీరు, షామియానాలు తదితర మౌలిక వసతులు కల్పించారు.

ఓటు హక్కును వినియోగించుకుంటున్న గ్రామస్తులు

పోలింగ్ సరళి – వివరాలు: ఆదోని మండలం-1 పరిధిలోని 14 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 40,519 మంది ఓటర్లు ఉండగా, అందులో 25,387 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఇక్కడ 62.65 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు వేసిన వారిలో 12,805 మంది పురుషులు, 12,581 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. మరోవైపు, ఆదోని మండలం-2 పరిధిలోని 17 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 50,383 మంది ఓటర్లకు గాను 34,924 మంది ఓటు వేశారు. ఇక్కడ అత్యధికంగా 69.32 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 17,507 మంది పురుషులు, 17,417 మంది మహిళలు ఉన్నారు.స

ఓటు హక్కును వినియోగించుకుంటున్న గ్రామస్తులు

ాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించి ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆవరణంలో ఆదోని మరియు మంత్రాలయం నియోజకవర్గం లోని మండలాల కౌంటింగ్ ప్రక్రియ శనివారం రోజు ఉదయం 8 గంటల నుండి ప్రారంభం అవుతుంది.

ఓటు హక్కును వినియోగించుకుంటున్న గ్రామస్తులు