కర్నూలు జిల్లా ఆదోని ఎస్ కే డి కాలనీ లో ఉన్న ఏపీ ఎన్జీవోస్ భవన్ పై టూ టౌన్ పోలీసుల దాడులు నిర్వహించి ఏపీ ఎన్జీవోస్ భవన్లో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 14 వేల 500 రూపాయలు నగదు మరియు 52 పేకముక్కలు స్వాధీనము చేసుకొన్నారు. టూ టౌన్ ఎస్ఐ తిరుపాల్ తెలిపిన వివరాల మేరకు పేకాట ఆడుతున్న వారిని విచారించగా యాసిన్ అనే వ్యక్తి ఆడిస్తున్నాడని తేలిందని తెలిపారు. ఈ దాడుల్లో టూ టౌన్ ఎస్ఐ తిరుపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.