కర్నూలు జిల్లా ఆదోని మండలం నగరూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని సుమారు 30 సంవత్సరముల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది అని ఆదోని రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు తీవ్రగాయాలతో అక్కడక్కడే మృతి చెందింది. మృతురాలు లైట్ రెడ్ రంగు గల లెగ్గిన్, గులాబి రంగు గల టాప్ కు బ్లూ రంగు డాట్స్, బార్డర్ ఉన్న టాప్ ధరించి వున్నది.ఆచూకీ తెలిసినవారు RPSI గోపాల్ ఆదోని ఫోన్ 9849157634 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీస్ తెలిపారు.