పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా ఆదోని మండలంలో 21 వేల7 వందల74 మంది రైతులకు రూ. 4 కోట్ల 35 లక్షల 48 వేలు డి బి టి ద్వారా నేరుగా రైతు ఖాతాలలో జమ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్ గ్రామం లో పీఎం కిసాన్ సమాన్ నిధి కార్యక్రమాన్ని లైవ్ వెబ్ క్యాస్ట్ ద్వారా ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుండి 17వ విడత ప్రారంభ కార్యక్రమాన్ని లైవ్ వెబ్ క్యాస్ట్ ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ 2000/- రూపాయలను డి బి టి ద్వారా జమ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మరియు రైతులతో ముఖాముఖి నిర్వహించరు. ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పెట్టుబడి సాయాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ వి. లోహిత ప్రియ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.