విశాఖపట్నం: హోమ్ మిస్టర్ అనిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైజాగ్ లో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నారని మండిపడ్డారు. ఒరిస్సా నుండి వైజాగ్ కి రావడానికి మూడు చెక్పోస్టులు మాత్రమే ఉన్నాయంటే ఎంత దారుణ పరిస్థితి అన్నారు అమెజాన్లో కూడా కరీ లీవ్స్ అని పేరు పెట్టుకుని గంజాయిని నమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణ పరిస్థితుల్లో రాష్ట్రంలో మార్పు రావాలంటే టాస్క్ ఫోర్ ఏర్పాటు చేసి రాత్రి 8 దాటితే గుంపులు గుంపులు గా కనిపిస్తే , చీకట్లో కనిపిస్తే చర్యలు తీసుకోండని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. స్మెల్ డిటెక్ట్ చేయడానికి డాగ్ స్క్వాట్లు రెండే కుక్కలు ఉన్నాయని అంత దారుణమైన పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు.