కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న కె.మనోజ్ కుమార్ స్టేషన్ ప్రాపర్టీ రూమ్ డూప్లికేట్ తాళాలు తయారు చేసుకుని వివిధ కేసుల్లో సీజ్ చేసిన 5 లక్షల 63వేల రూపాయలు దొంగతనం చేసినట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. హోంగార్డు మనోజ్ పై ఐపిసి 454-380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 3 లక్షల రూపాయలు నగదును స్వాధీనం తీసుకొని డి.ఎస్.పి శివ నారాయణ స్వామి ట్రైనీ డిఎస్పి ధీరజ్ ముందు హాజరు పరచి రిమైండ్ కి తరలించారు.