Connect with us

News

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్ధమవుతున్న బాలికలు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ లో అండర్ 17 గర్ల్స్ విద్యార్థినిలకు కబడ్డీ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపు నవంబర్ 17వ తేదీన 22వ తేదీ వరకు నిర్వహించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 12 మంది విద్యార్థినిలకు కోచ్ పి.ఇ. టి రమన్న, టీమ్ మేనేజర్ హరిత, పి.ఇ. టి నరసింహులు, పి.ఇ. టి గంగాధర్ శిక్షణ అందించారు. కోచ్ రామన్న తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లాలోని కర్నూలు, బనగానపల్లె, డోన్, పల్లెపాడు, పెద్ద హరివానం మండలాల నుంచి 12 మంది విద్యార్థినిలు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. గత సంవత్సరం అండర్ 14 గర్ల్స్ క్యాంపు నిర్వహించి నగరిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారని అందువల్ల ఈ సంవత్సరం అండర్ 17 గర్ల్స్ క్యాంప్ నిర్వహిస్తున్నామని విద్యార్థినీలు శిక్షణ పూర్తి అయిన తర్వాత చౌడేపల్లి లో జరిగే రాష్ట్రస్థాయి మహిళ కబడి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. శిక్షణ కోసం గ్రౌండ్ ఇచ్చిన ఆర్ట్స్ కాలేజ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

క్యాంప్లో పాల్గొన్న విద్యార్థినిల గ్రూప్ ఫోటో
యూట్యూబ్ వీడియో

News

ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్

Published

on

ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.

ఆర్టీసీ డిపో ముందు నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సిపి నాయకులు
బందులో పాల్గొన్న వైఎస్ఆర్ సీపీ నాయకులు
Continue Reading

News

ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

ఆదోని 09-01-2026:

కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు

09 01 26 రైతు బజార్ ధరల పట్టిక
అడ్వర్టైజ్మెంట్
Continue Reading

News

వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక

Published

on

వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.

Continue Reading

Trending