మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి నల్లమల అడవుల్లో పెద్దపులి మృతి చెందింది. మూడు నెలల్లో 3 పులులు మృతి చెందడం పై ఫారెస్ట్ అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నరు అదేవిధంగా జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు మండలం బొల్లు పల్లి సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం తురిమిళ్ళ అటవీ రేంజ్ పరిధిలో పెద్దపులి మృతి చెందింది. దీనిపై ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టి పులికి పంచనామ నిర్వహించి శరీర అవశేషాలను పోస్టు మార్టానికి పంపించారు. పెద్దపులి వయసు దాదాపు మూడు సంవత్సరాలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. పులి వేరే పులితో పోరాడుతూ మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంపై అధికారులు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. 3 నెలల వ్యవధిలో శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో 3 పులులు మృతి చెందడం ఈ వరుస పులి మరణాలు అటవీ అధికారులను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి.

ఈఏడాది జూలై 31న రాచర్ల సమీపంలో చనిపోయిన ఒక పులి కళేబరం కనిపించింది. దానిని వేటగాళ్లు చంపినట్లు తేల్చిన ఫారెస్ట్ అధికారులు ఏడుగురుని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ద్వారా విచారణ చేసి పులుల భద్రతపై ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించారు. ఈ ఘటన మరువక ముందే మంగళవారం పాపినేనిపల్లి సమీపంలో మరో పులి మృత్యువాత పడింది. ఒకే డివిజన్లో వరుస ఘటనలు జరగడంతో గిద్దలూరు అటవీ డివిజన్లో అధికారులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.