రూ.10.70 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

కర్నూలు జిల్లా ఆదోనిలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి వాల్మీకి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.10,70,888 విలువైన చెక్కులను 11 మంది లబ్ధిదారులకు ఆయన స్వయంగా అందజేశారు.

సీఎం రిలీఫ్ పండు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని స్పష్టం చేశారు.

పూర్తి వీడియో కాల్ ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి

​ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు పులి రాజుతో పాటు బీజేపీ నాయకులు నాగరాజు, విజయకృష్ణ, ఉపేంద్ర కుమార్, రమాకాంత్, శ్రీనివాస్ ఆచారి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Back To Top