కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్‌లో సబ్సిడీ ధరకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్సీ బీటీ నాయుడు చేతుల మీద ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమాపతి నాయుడు హాజరయ్యారు.
సబ్సిడీ సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ బీటీ నాయుడు
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ, రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారునికి కిలో రూ.50 చొప్పున నెలకు 10 కిలోల సన్న బియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం రైతు బజార్‌తో పాటు పట్టణంలోని ప్రధాన సూపర్ మార్కెట్లలో కూడా ఈ బియ్యాన్ని అందుబాటులో ఉంచామని, పేద, మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చిన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉమాపతి నాయుడు
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ శారద, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, టీడీపీ నాయకులు తిమ్మప్ప, శివప్ప, రంగస్వామి నాయుడు, జిందే శంకర్, గుడిసె శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
■10 రోజులకొకసారి మంచినీళ్లు.. రోడ్లు, డ్రైనేజీలు లేక నరకయాతన ■ సచివాలయ తలుపులకు వినతిపత్రం అతికించిన కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు
ఆదోని (కర్నూలు జిల్లా): ఆదోని మండలం బసరకోడు గ్రామంలోని దళిత కాలనీవాసులు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే అక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
వినతిపత్రం అందజేయడానికి వస్తే తాళం వేసి ఉన్న గ్రామ సచివాలయం
మంగళవారం దళిత కాలనీలో పర్యటించిన వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు ఉచ్చిరప్ప, కేవీపీఎస్ మండల అధ్యక్షుడు మునిస్వామి, నాయకుడు రామాంజనేయులు స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. కాలనీలో రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ లేక రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీసం పది రోజులకు ఒకసారి కూడా తాగునీరు అందడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.
యూట్యూబ్ వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
అధికారుల నిర్లక్ష్యంపై నిరసన: స్థానిక సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసేందుకు ఉదయం 10:40 గంటలకు గ్రామ సచివాలయానికి వెళ్లగా, అప్పటివరకు ఏ ఒక్క అధికారీ కార్యాలయానికి రాలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమయపాలన తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, వినతిపత్రాన్ని సచివాలయ తలుపులకే అతికించి నిరసన తెలిపారు. పాలకులు, అధికారులు స్పందించి దళిత కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 04 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1616.13 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 51.145 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు:
ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 82087 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 91546 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1447 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 712.654 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.