కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో సబ్సిడీ ధరకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్సీ బీటీ నాయుడు చేతుల మీద ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమాపతి నాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ, రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారునికి కిలో రూ.50 చొప్పున నెలకు 10 కిలోల సన్న బియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం రైతు బజార్తో పాటు పట్టణంలోని ప్రధాన సూపర్ మార్కెట్లలో కూడా ఈ బియ్యాన్ని అందుబాటులో ఉంచామని, పేద, మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ శారద, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, టీడీపీ నాయకులు తిమ్మప్ప, శివప్ప, రంగస్వామి నాయుడు, జిందే శంకర్, గుడిసె శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.