ఆదోని:  పాండవగల్లు పెద్ద చెరువు సమస్యను తక్షణమే పరిష్కరించాలని, యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నారా లోకేష్ నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలతో కలిసి సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఆదోని – మాధవరం రోడ్డుపై పాండవగల్లు వద్ద మంగళవారం నిరసన తెలపడం జరిగింది.

రోడ్డుపై నిరసన తెలుపుతున్న గ్రామస్తులు
పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ.. గత 13 సంవత్సరాలుగా పాండవగల్ పెద్ద చెరువు సమస్య హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. గతంలో నిర్వహించిన యువగళం పాదయాత్రలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రేపు ఆయన ఆదోనికి వస్తున్న సందర్భంగా, ఈ చెరువు సమస్యపై స్పష్టమైన ప్రకటన చేసి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజల నిరసనలు తీవ్రతరం చేసి, తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ పెద్దలు కే.మారయ్య, పి.ఈరన్న, మాజీ వైస్ సర్పంచ్ జే.తిక్కయ్య, రామాంజనేయ, కే.హనుమంతు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు జే.రామాంజనేయులు, మండల నాయకులు కే.పాండురంగ, శాఖా కార్యదర్శులు కే.గోవిందు, అనీఫ్ బాషా, నర్సిరెడ్డి, భీమాంజనేయులు, తాయప్ప, తాయన్న, హనుమంత రెడ్డి, కొండయ్య, రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె.హుసేని, డీజే నర్సిరెడ్డి, మంజు, పాండవగల్ గ్రామ విద్యా కమిటీ చైర్మన్ S.తాయన్న, DYFI సీనియర్ నాయకులు ఎస్.రామాంజనేయులు, గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు కె.వీరేష్, కె.వీరంజి, మండల నాయకులు మోహన్ రెడ్డి, గ్రామ నాయకులు భాస్కర్, S.తాయాన్న, కే.రామకృష్ణ, అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *