Connect with us

News

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Published

on

■ ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 40 కి పైగా కేసులు ఉన్న అంతర్రాష్ట్ర పశువులదొంగ ముఠా అరెస్ట్..
■ సుమారు 1 కోటి 50 లక్షల విలువ చేసే పశువుల స్వాధీనం..
■ మారున ఆయుధాలు ఒక కారు రెండు బొలెరో వాహనాలు 14 సెల్ ఫోన్లు స్వాధీనం..

పోలీసులు స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు
వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

కర్నూలు జిల్లా ఆదోని లో అంతర్రాష్ట్ర పశువుల దొంగలు ముఠా అయిన 16 మంది ముద్దాయులను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా 9 మంది పరారీలో ఉన్నరు వారివద్ద నుండి సుమారు 1 కోటి 50 లక్షల విలువ కలిగిన పశువులు (మేకలు & పందులు) మరియు 02 బోలెరో క్యాంపర్ వాహనాలు ఒక ఫోర్డ్ కారు, మారణాయుధాలు, 14 సెల్ ఫోన్, ఖాళీ కూల్ డ్రింక్స్ బాటిల్లు, కారంపొడి ప్యాకెట్లు, రాళ్లు స్వాదీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు

డీఎస్పీ హేమలత తెలిపిన వివరాల మేరకు ఆదోనిలో పశువుల దొంగతనాల 13 కేసులు నమోదు కాగా అందులో మొత్తం 25 మందికి పైగా ముద్ధాయులు ఉన్నారని వారిలో 16 మందిని అరెస్టు చేశామని తెలిపారు మిగిలిన వారికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గావిస్తున్నామని తెలిపారు. అరెస్ట్ అయిన వారిపై కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో  వీరిపై మొత్తం 40కి పైగా జేసులు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. వీరు దొంగతనానికి రాత్రి ఒకటి నుంచి మూడు ప్రాంతంలో చేస్తారని ఆ సమయంలో ఎవరు అడ్డు వచ్చినా మారున ఆయుధాలతో రాడ్లతో కత్తులతో ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్లతో కళ్ళలో కారం కొట్టి నరరూప రాక్షసుల దాడులు చేస్తారని తెలిపారు. అంతేకాక వారి వాహనాలతో గుద్ధి వెళ్లిపోతారని వీరిపై అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయని తెలిపారు. వీరంతా కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప గ్రామానికి చెందిన వారిని తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు

ఆదోని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు  శ్రీరామ్ స్టేషన్ సిబ్బంది రాబడిన సమాచారము మేరకు 15.09 2925 వ తేదీన సాయంత్రం 04:00 గంటలకు ఆదోని నుంచి మారవరం కు పోషి రోడ్ లో గల భారత్ గ్యాస్ గోడౌస్ ఎదురుగా పాడుబడిన శ్రీనివాస ట్రేడింగ్ & జీన్సింగ్ ఫ్యాక్టరీ అపరణము లో 16 మందిని అదుపులోనికి తీసుకుని విచారించగా

పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు

వారి నుంచి  1,49,33,000/- (అక్షరాలా ఒక కోటి సలబై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల విలువ రూపాయలు) విలువ చేసే 542 పశువులను, రెండు బోలెరో వాహనాలను, ఒక కారును, వివిధ రకాలైన మారణాయుధాలను, కారం పొడిని మరియు 16 ప్లాస్టిక్ కారేట్ లలో ఉన్న ఖాళీ రూల్ డ్రి బాటిల్లను స్వాధీన పరచుకుని 16 మంది ముద్దాయులను రిమైండ్ కి తరలిస్తున్నట్లు తెలిపారు. పై తెలిపిన ముద్దాములు, సశువుల దొంగతనము చేసే క్రమం లో బాదితులు కానీ, పోలీసులు కానీ పట్టుకునే ప్రయత్నం చేసిన వారిపై క్రూరంగా బాధితులను, అడ్డు వచ్చిన పోలీసుల పై కారం పొడి చల్లి కట్టెలు, రాళ్ళు సీసాల తో, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న బొలెరో క్యాంపర్
పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్, బొలెరో క్యాంపర్

గతం లో కూడా తెలంగాలు రాష్ట్రం లో జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలలో మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం జిల్లాలో పలు పోలీసు స్టేషన్ పరిధి లో అనేక చోట్ల రబరి, డకాయిటీ లకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో రెండు వారాల కిందట యెమ్మిగనూర్ మరియు ఆదోని లో అడ్డొచ్చిన బాధితులను తలు మరియు చేతులు విరగగొట్టి పోలీసులపై కూడా దాడి చేసినట్లు తెలిపారు.  వీరిపై మొత్తం 40కి పైగా జేసులు రిజిస్టర్ రిజిస్టర్ అయినట్లు తెలిపారు. ఈ కేసులలో మొత్తం 25 మందికి పైగా ముద్ధాయులు ఉందగా వారిలో 16 మండి ప్రస్తుతము ఆరెస్టు చేశామని వీరిలో ఒకరి మీద కోడుమూరు పరిధిలో ఒక మర్జర్ కేసు మరియు ఒకరి మీద యెమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్లో దొమ్మి, హత్యా ప్రయత్నం కేసులు నమోదు అయ్యాయని తెలిపారు మిగిలిన 9 మంది ముదాయుల కొరకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి శ్రీరామ్ ని వారి సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు

ముద్దాయిలను మీడియా ముందుకు తెస్తున్నా పోలీసులు

ముద్దాయుల నుంచి స్వాధీనపరచుకున్న వాటి వివరాలు..
1. అక్షరాలా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల విలువ రూపాయలు (Rs. 1,49,33,000/-) విలువ చేసే 542 పశువులు
2. KA36B 9672 మరియు KA3689672 రిజిస్ట్రేషన్ సంబర్ గల రెండు Bolero వాహనాలు
3. AP16 DP5708 రిజిస్ట్రేషన్ నెంబర్ గల ఒక కారు..
4. వివిద రకాల మారణాయుధాలు..
5. 16 ప్లాస్టిక్ కారేట్ లలో ఉన్న ఖాళీ కూల్ డ్రింక్స్ బాబిళ్లు..
6. కారం పొడి ప్యాకెట్లు..
అదుపులోనికి తీసుకోబడిన ముద్దాయి ల వివరాలు:
1. యెరుకల మజ్జ (ముత్తు), సోమ్లాపూర్ గ్రామం, సింధనూర్ తాలూకా, రాయచూర్ జిల్లా, కర్ణాటక.
2. యెరుకలి బజంత్రీ కృష్ణ శ్రీ బాబా, సిందనూర్ టౌస్, రాయమార్ జిల్లా, కర్ణాటక రాష్ట్రము.
3. ఐజంల సిద్దు @ యరుకలి సిద్దు, సింధనూర్ టౌన్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం,

ముద్దాయిలను మీడియా ముందుకు చేస్తున్న పోలీసులు

4. బజంత్రి మల్లికార్జున @ ఎరుకలి మల్లికార్జున @ మల్లి, సింధనూర్ టౌన్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.
5. యెరుకలి చంద్ర (@ చమ్మక్ చంద్ర, BC కాలనీ, హోళగుంధ గ్రామం & మండలం, కర్నూలు జిల్లా, ప్రస్తుత నివాసము సచివాలయం సమీపంలో, చిన్న హుల్తీ గ్రామం, పత్రికొండ మండలం, కర్నూలు జిల్లా.
6. యెరుకల హుసలప్ప @ హుసల, సిందనూర్ టౌస్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం,
7 యెరుకల రంగన్న, శక్తిగుడి, ఎద్దుల మార్కెట్ దగ్గర, యెమ్మిగనూరు టౌన్, కర్నూలు జిల్లా.
8. యెరుకలి నాగరాజు @ సిరిగేరి నాగరాజు @ రుప్ప, సిరిగేరి గ్రామం, సిరుగుప్ప తాలూకా, బళ్లారి జిల్లా, కర్ణాటక రాష్ట్రం
9. విజంత్రీ హనుమంతు @ ఎరుకలి హనుమంతు @ గుడ్డిలప్ప, సిందనూర్ టౌన్, రాయమార్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం
10. యెరుకలి అర్జున్ @ కోలగల్లు అర్జున్, కోలగల్లు గ్రామం, బళ్లారి తాలూకా (@) జిల్లా, కర్ణాటక రాష్ట్రం
11. యెరుకలి మహేష్ మదిన గ్రామం, కొతాళం మండలం, కర్నూలు జిల్లా,
12 బంద్ శంకర్ కోట్, జనతా కాలనీ, సిండమార్ టౌన్, రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం
13. వాల్మీకి వెంకటేష్ @ వెంకి, హనుమంత క్యాంపు, సిందనూర్ తాలూడా రాయచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం..
14. చెరుకలి ఆంజనేయులు @ మిగుదొడ్డి అంజి, సంగుదొడ్డి గ్రాము, అయి ముండలు, గన్నాల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
15. ఎరుకలి సందేశ్ @ గొంటు, అక్కలకోట గ్రామము, సిరుగుప్ప తాలూకా, బళ్ళారి జిల్లా, కర్నాటక రాష్ట్రము.
26. ఎరుకలి రవిచంద్ర డవి, మంకేశ్వరి గ్రామము, ముంద్రాజయం మండలం కర్నూల్ జిల్లా
పరాప్ లో ఉన్న ముద్దాయులు..
1. కృష్ణ, సింధనూరు టౌన్
2. సుంకన్న, కందనతి, యెమ్మిగనూరు,
3. భీమ, యెమ్మిగనూరు.
4 మారేష్, చిన్న హుల్తి
5. అంజి, హోలగుంద
6. రమేషు తురుకల్ డోన, రాయచూరు జిల్లా
7. కొరగల్ మరేష్ @ గుడ్ల మరేష్
3. యెమ్మిగనూడు పెద్ద నాగరాజు
9. చిన్న నాగరాజు @ బాతు

News

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

Published

on

అదోని: తన భార్యను అత్తగారింటి నుండి పంపడం లేదన్న మనస్తాపంతో ఒక యువకుడు ఏకంగా రేడియో టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు మూడు గంటల పాటు హైడ్రామా నడిచిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో యువకుడు క్షేమంగా కిందకు దిగాడు.

పోలీసుల హామీతో శాంతించిన యువకుడు

అసలేం జరిగింది?.. ఆలూరు నియోజకవర్గం, చిప్పగిరి మండలం నేమకల్ గ్రామానికి చెందిన సురేంద్ర, అదే గ్రామానికి చెందిన నాగేశ్వరి అనే యువతిని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పండగ కోసమని నాగేశ్వరిని ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. పండగ ముగిసినా తన భార్యను తిరిగి కాపురానికి పంపకపోవడంతో సురేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

ఫుల్ వీడియో

టవర్ ఎక్కి హల్చల్ : శనివారం అదోనిలోని రేడియో టవర్ ఎక్కిన సురేంద్ర, తన భార్యను పంపకపోతే కిందకు దూకేస్తానని బెదిరించాడు. మూడు గంటల పాటు టవర్ పైనే ఉండి అందరినీ ఆందోళనకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న సీఐ రాజశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

టవర్ పై ఎక్కిన యువకుడు

పోలీసుల హామీతో శాంతించిన యువకుడు .. సీఐ రాజశేఖర్ టవర్ కింద నుండి సురేంద్రతో మాట్లాడి నచ్చజెప్పారు. “నీ భార్యను, మీ అత్తమామలను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడతాం. మీ ఇద్దరినీ కలిపి కాపురానికి పంపించే బాధ్యత నాది” అని సీఐ హామీ ఇవ్వడంతో సురేంద్ర శాంతించి కిందకు దిగివచ్చాడు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం భార్యపై ఉన్న ప్రేమతోనే ఆవేశంలో ఇలాంటి పని చేశాడని సీఐ మీడియాకు వివరించారు

Continue Reading

News

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

Published

on

ఆదోని, ఏప్రిల్ 13:

పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్‌కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:

  • కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
  • నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
  • ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

​ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.

Continue Reading

News

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

Published

on

ఆదోని, ఏప్రిల్ 03:

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పైకప్పు ఊడిపడిన ఫోటో

ఘటన వివరాలు:

​శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

చికిత్స పొందుతున్న విద్యార్థి

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:

​ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

చికిత్స పొందుతున్న విద్యార్థి

యాజమాన్యం వివరణ:

​ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.

పూర్తి వివరాల కోసం యూట్యూబ్ వీడియో ను క్లిక్ చేయండి

తల్లిదండ్రుల ఆందోళన:

​శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

బాలాజీ విద్యానికేతన్ స్కూల్ బిల్డింగ్ ఫోటో
Continue Reading
News3 days ago

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

News2 weeks ago

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

News4 weeks ago

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

News1 month ago

ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

News2 months ago

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

News2 months ago

హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్

News2 months ago

ఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!

News2 months ago

సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట

News2 months ago

పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ

News2 months ago

నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి

Trending