కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘానికి తక్షణ అవసరాల కొరకు రూ 1 కోటి 24 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింనట్లు ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. శుక్రవారం పురపాలక శాఖ మంత్రి నారాయణని కలసి ఆదోని పురపాలక సంఘం పరిధిలోని విస్తారణ ప్రాంతాల అబివృద్దికి సంబంధించి రూ 44 కోటి నిధులకు అవసరమని కోరారు. పట్టణంలోనీ విస్తరణ ఏరియాలలో ప్రజలకు కనీసం అవసరాలైన మురుగు కాలువలు, రోడ్లు, పైపులైన్లు సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వారి సౌకర్యార్థము ప్రత్యేక నిధులను మంజూరు చేయించాల్సిందిగా మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి తక్షణ అవసరాల కోసం కోటి 24 లక్షలను మంజూరు చేసినట్టు తెలిపారు. మిగిలిన నిధులను ప్రత్యేక నిధుల కింద మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *