కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో 5 ప్రభుత్వ హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదోని శాసనసభ్యులు పార్థసారధి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను కోరారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ సమయంలో ఎమ్మెల్యే పార్థసారథి గారు మంత్రి నారా లోకేష్ ని కలిసి ఆదోని నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేయాల్సిన విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యపై నిర్లక్ష్యం చేసి ఆదోని పట్టణంలో ఉన్న ఏడెడ్ ఉన్నత పాఠశాలలు మూతపడడం విచారకరమన్నారు. ఆదోని మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసే అవసరం ఎంతైనా ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి విద్యాలయాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *