News
ఇంటింటి కోళ్ళాయి పథకం కింద 77 కోట్లు నిధులు కేటాయించండి- ఎంఎల్ఏ
అమరావతి: కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని విరామ సమయాల్లో ఆదోని అభివృద్ధి కోసం మంత్రులతో అధికారులతో కలుస్తున్నారు అందులో భాగంగా ఇంటింటి కోళ్ళాయి (జల్జీవన్ మిషన్) పథకం క్రింద ఆదోని అసెంబ్లీ పరిధిలోని గ్రామాల్లో శుద్ధమైన త్రాగునీటి సరఫరా కొరకు 77 కోట్లు నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి కోరారు. మంగళవారం అసెంబ్లీ సెషన్స్ విరామ సమయంలో పవన్ కళ్యాణ్ ని కలిసి ఇంటింటి కోళ్ళాయి పథకంకు సంబంధించిన టెండర్లను పిలవాల్సిన నివేదికను సమర్పించారు. ఆదోని అసెంబ్లీ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి ఎద్దడి అధికంగా ఉందని గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రామీణ పాత్రలో ఇంటింటి కోళ్ళాయి పథకాన్ని అమలు చేయలేక పోయారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదోని మండల పరిధిలోని సుమారు 25 గ్రామాల్లో ఇంటింటి కోళ్ళాయి పథకం ప్రారంభానికి నోచుకోలేదని, ఆ గ్రామాల్లో నీటి సరఫరా కోసం రూ 77 కోట్ల రూపాయల అంచనాలను గత అధికారులు తయారు చేసినప్పటికి అప్పటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు నీటిని అందించలేకపోయారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నీళ్లు అందించేందుకు కృషి చేయాలన్ని కోరారు.
గ్రామీణ రోడ్ల ఏర్పాటు, మరమ్మతులకు రూ 13 కోట్లు మంజూరు చేయాలి..
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గల గ్రామీణ రోడ్ల ఏర్పాటు, మరమ్మతులకు రూ 13 కోట్లు మంజూరు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థసారధి కోరారు. మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం విరామ సమయంలో మంత్రి గారిని కలిసి ఆదోని మండల పరిధిలోని గ్రామ పంచాయతీ రోడ్ల ఏర్పాటుకు సంబంధించిన సమర్పించి రోడ్ల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. మంత్రి పవన్ కళ్యాణ్ అందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
నీటి సరఫరా కొరకు 250 బోర్ వెల్స్ వేయాలి..
మండలంలో నీటి సరఫరా కొరకు 250 బోర్ వెల్స్ వేయించుట గురించి కూడా ప్రస్తావించారు. అలాగే మండల పరిధిలోని బసాపురం గ్రామంలో ఉన్న జగనన్న కాలనీలో ఎస్. ఎస్. ట్యాంక్ నిర్మాణం కొరకు రూ రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
