చెత్త కుప్పలో పారిశుద్ధ్య కార్మికులు రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను వెతికి తీశారు.
చెన్నైలో వెలుగుచూసిన అరుదైన ఘటన. ఇటీవల చెత్తను పారవేసే క్రమంలో డైమండ్ నెక్లెస్‌ను చెత్త డబ్బాలోకి విసిరివేశారు. ఆలస్యంగా నెక్లెస్ పోయిన విషయాన్ని గమనించారు.
చెన్నైలో పట్టణానికి చెందిన దేవరాజ్ అనే వ్యక్తి తన కుమార్తె వివాహం కోసం చేయించిన రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను పొరపాటున చెత్త బుట్టలో పాడివేశాడు. పారిశుద్ధ కార్మికులు బుట్టలో ఉన్న చెత్తను తీసుకొని వెళ్ళిపోయారు. కొద్దిసేపు తర్వాత గుర్తు చేసుకున్న యజమాని కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నై కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించారు. అక్కడి అధికారులు వెంటనే చెత్తను సేకరించడానికి చెన్నై కార్పొరేషన్ ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ విషయం తెలిపారు. అధికారుల పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్మికులు సమీపంలోని అన్ని చెత్త డబ్బాలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో.. ఓ చెత్త కుప్పలో పూలమాలలో చిక్కుకుపోయిన డైమండ్ నెక్లెస్ కనిపించడంతో అందరూ ఆనందంతో ఊపిరి పీల్చుకున్నారు. చెన్నై కార్పొరేషన్ అధికారులు ఆ డైమండ్ నెక్లెస్‌ను తిరిగి యజమానికి అందజేశారు.
తన దుఃఖాన్ని బాధను అర్థం చేసుకున్న అధికారులు వెంటనే స్పందించి విలువైన నెక్లెస్‌ను వెతికి ఇచ్చినందుకు అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు దేవరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.