ఆదోని అసెంబ్లీ పరిధిలోని రోడ్ల మరమ్మతులకు రూ 61 కోట్లు నిధులు కేటాయించాలని ఆదోని శాసనసభ్యులు పివి పార్థసారధి రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బి సి జనార్దన్ రెడ్డిని కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశం అనంతరం మంత్రి గారి చాంబర్లో ఎమ్మెల్యే గారు కలిసి ప్రతిపాదనలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ ఆదోని అసెంబ్లీ పరిధిలోగల ప్రధాన రహదారుల రోడ్లు ఏర్పాటు, గ్రామాల అంతర్గత రోడ్ల ఏర్పాటు, మరమ్మతులకు గురైన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అందుకు కావాల్సిన అన్ని చర్యను చేపడతామన్నారు. అందుకు మంత్రిగారు సానుకూలంగా స్పందించి నిధులు కేటాయిస్తామని తెలిపినట్లు తెలియజేశారు. త్వరలో అసెంబ్లీ పరిధిలోని రోడ్లన్నింటికీ మహర్దశ వస్తుందని ఆశావాహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *