డయేరియా తగ్గేంతవరకు గ్రామంలో వైద్యాధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
ఆదేశాలు ఇచ్చారు.
కర్నూలు జిల్లా ఆదోని ఏరియా ఆసుపత్రిలో అతిసార వ్యాధితో బాధపడుతున్న మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామవాసులను సబ్ కలెక్టర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వైద్యాధికారులు నిత్యం అందుబాటులో ఉండి అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
అనంతరం మంత్రాలయం మండలం సుంకేశ్వరీ గ్రామంలో మెడికల్ క్యాంపు, శానిటేషన్, వాటర్ ట్యాంకు ద్వారా త్రాగునీటి సదుపాయం, వివిధ సదుపాయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వానాకాలం అయినందున ప్రజలు నీటిని కాచి తాగేలా అవగాహన కల్పించాలని వైద్యాధికారులను సూచించారు. గ్రామాల్లో డయేరియా లేదా ఇలాంటి వ్యాధులతో బాధపడే వారు వెంటనే సంబంధిత పిహెచ్సి డాక్టర్లను సంప్రదించాలని సబ్ కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు..