వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖపట్నం మీడియా సమావేశంలో జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తూ ఆదోని డీఎస్పీ శివ నారాయణ స్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని భావిస్తున్నాము అని అన్నారు. జర్నలిస్టులను వీడు, వాడు, ఒరే బాబు అంటూ సంబోధించడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని విజయసాయి రెడ్డి పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు పాల్గొన్నాయి.