కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో బిజెపి తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు. ఆదోని 35వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి లలితమ్మ భర్త మధుసూదన శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర మత్స్యకార సంఘం రాష్ట్ర కార్యదర్శి పగడాల నీలకంఠ మరియు భాస్కరరెడ్డి కాలనీ, బీమ్ రెడ్డి కాలనీ, వైఎస్సార్ నగర్ కాలనీలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 150 కుటుంబాలు ఎమ్మెల్యే పార్థసారథి చేతుల మీదుగా బిజెపి కండువా కప్పుకొని పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మధుసూదన శర్మ మరియు నీలకంఠ విలేకరులతో మాట్లాడుతూ శాసనసభ్యులు పార్థసారథి వాల్మీకి ఆదోని అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలమధ్యలో ఉంటూ పట్టణాభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అందువల్ల ఆయన అడుగుజాడల్లో నడవాలనే సంకల్పంతో ఆదివారం బిజెపి పార్టీలో చేరడం జరిగిందిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ నేను ఆదోని అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడతానని, ఆదోని అభివృద్ధి కోసమే ప్రజలు నాకు ఓటు వేసి గెలిపించారని ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి నాకు ఎవరు కలిసి చేస్తామంటే వారందరినీ పార్టీలో చేర్చుకుని ఆదోని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తానని పార్థసారథి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి బడాయి పంపాపతి, బిజెపి పట్టణ అధ్యక్షులు జిందే సాయి, మధుమాధవ్, కౌన్సిలర్ చిన్న, కల్లుబోతుల సురేష్, కృష్ణమోహన్, రవికిరణ్, వేణు, శేఖర్, భాస్కర్, విజయ్, వీరేష్, దస్తగిరి, భరత్, ఈరేష్ మొదలైన వారందరూ పాల్గొన్నారు.