కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాతన హళ్లి గ్రామంలో జూలై 12వ తేదీన దళిత మహిళ గుండమ్మను ట్రాక్టర్ తో తొక్కించి చంపడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించరు సిపిఎం పార్టీ పట్టణ, మండల కార్యదర్శులు లక్ష్మన్న లింగన్న. ఈ హత్యకు పాల్పడిన వాళ్లును (టిడిపి వర్గీయులుగా భావించే) అగ్రవర్ణాలకు సంబంధించిన రాఘవేంద్ర, రెడ్డి శ్రీధర్ రెడ్డి తో పాటు మరో ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
అధికారం ఉంది ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో దళిత మహిళపై ఇలాంటి దారుణానికి ఒడి కట్టడం సరైనది కాదని, ఇలాంటి హత్యలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఖండించాలని హంతకులను కఠినంగా శిక్షించాలని, అలాగే భూ వివాదాలు ఆదోని నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయని, గత రెవెన్యూ అధికారుల వైఫల్యమే కారణమని అన్నారు. ఇలాంటి భూ సమస్యలు (గ్రామాల్లో, పట్టణాల్లో) ఎక్కడున్నా వెంటనే రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ యంత్రాంగం జోక్యం చేసుకొని సామరస్యంగా పరిష్కరించాలని, హత్యలు, గొడవలు జరగకుండా ఆపాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భూ సమస్యలు పరిష్కరించే విధంగా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్ గోపాల్, తిప్పన్న, మండల కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, పట్టణ నాయకులు కృష్ణమూర్తి వెంకటేశు, మండల నాయకులు పరమేష్ తదితరులు పాల్గొన్నారు.