కర్నూలు జిల్లా ఆదోని ( మం) నాగనాథన హల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వైసిపి పార్టీ కి చెందిన గుండమ్మ (45) అనే దళిత మహిళ పై ట్రాక్టర్ తో దాడి చేసి , గుండమ్మ తరపున అడ్డొచ్చిన పురుషోత్తమ రెడ్డి పై దాడి చేసిన రాఘవేంద్ర రెడ్డి కొడుకు శ్రీకాంత్ రెడ్డి , ఆతని అనుచరులు పరారీ లో ఉన్నారు.
ఈ ఘటనలో గుండమ్మ అక్కడిక్కడే మృతి చెందగా పురుషోత్తం రెడ్డికి తీవ్ర గాయాలు.
సర్వే నెంబర్ 500d లో 4 ఎకరాలు భూమి నీ 2019 లో రాఘవేంద్ర రెడ్డి (రాఘప్ప ) చిన్నమ్మ తిరుమలమ్మ తో గుండమ్మ కొనుగోలు చేసింది. అదే పొలాన్ని తిరుమలమ్మ భర్త లేట్ సోమశేఖర్ రెడ్డి తమకు అమ్ముడానికి అగ్రిమెంట్ చేసి మృతి చెందారని , అదే పొలాన్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారని తరచూ గుండమ్మ తో రాఘవేంద్ర రెడ్డి గొడవపడేవారు అందులో భాగంగానే పొలం దున్నే విషయంలో ఇరువురు గత 5 ఏళ్లుగా గొడవ పడుతున్నారు.
గతంలో వైసిపి అధికారంలో ఉండటంతో గమ్మున ఉన్న రాఘవేంద్ర రెడ్డి టీడీపీ అధికారంలో రావడంతో శుక్రవారం ఆదోని కల్లుబావికి చెందిన పురుషోత్తమ రెడ్డి సహకారంతో పొలం దున్నడానికి వెళ్లిన గుండమ్మ పై రాఘవేంద్ర రెడ్డి ప్రోద్బలంతో అతని కుమారుడు శ్రీకాంత్ రెడ్డి ట్రాక్టర్ తో గుద్ది, అడ్డొచ్చిన పురుషోత్తం రెడ్డి పై దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో గుండమ్మ అక్కడికక్కడే మృతి చెందగా , పురుషోత్తమ రెడ్డి కి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలిని మరియు పురుషోత్తమ రెడ్డి నీ ఆదోని జనరల్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన జరిగిన వెంటనే ఆదోని తాలూకా పోలీసులు గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.