పదేళ్ళు గడిచినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య
విభజన సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడలేదు. షెడ్యూల్ 9 లోనీ 89 ప్రభుత్వ కంపెనీ లు & కార్పొరేషన్లు, షెడ్యూల్ 10 లోనీ 107 రాష్ట్ర సంస్థలు ఉన్నాయి. ఈ ఉమ్మడి ఆస్తుల విభజన పంపకాలు మాత్రం జరగలేదు. ఇవి తెలంగాణ లో 91% ఆంధ్రాలో 9% ఉన్నాయి..
వీటి ఆస్తుల విలువ దాదాపు లక్షన్నర కోట్లు పైనే. విభజన చట్టం ప్రకారం పంపకాలు సరిగా జరిగితే. ఆంధ్రప్రదేశ్ కి 58% తెలంగాణకి 42% చట్ట పరంగా దక్కాలి. కనీసం ఆంధ్రప్రదేశ్ కు అక్షరాల 85 వేల కోట్లు లాభం. విద్యుత్ బకాయిల సంగతి తెలిసిందే. అంతర్రాష్ట్ర జలవివాదాలకు స్వస్తి పలకలేదు.. కొన్ని జలప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగలేదు. నాడు చంద్రబాబు నాయుడు , కేసిఆర్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి కొంతవరకూ కట్టుబడి అడుగులు వేస్తే. ఆ తర్వాత అధికారం లోకి వచ్చిన గత ప్రభుత్వాలు నీటి యుద్దాలు సృష్టించి. రెండు తెలుగు రాష్టాల సమస్యలు జఠిలం చేశారు. అవసరం మేరకు రాష్టాల సమస్యలు రాజకీయం కొరకు వాడుకున్నారు. నేడు తాజాగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రజా భవన్ వేదిక గా భేటీ అనగానే సామాన్య ప్రజలు అంచనాలు రెండు రాష్టాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడతాయి అని భావిస్తున్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం అయినా మరి కొన్ని వివాదాలు అంత సులభంగా పరిష్కారం అవుతాయి అని భావించడం లేదు. కాస్త సమయం పట్టొచ్చు. న్యాయ పరమైన చిక్కులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య మంచి సంబంధాలు ఉన్నపటికీ..
వారు ఇద్దరూ రెండు రాష్ట్రాలకు ప్రతినిధులు. అయిననూ అందరం సోదరులమే కదా అని ఇద్దరూ సమస్యల విషయం లో పట్టువిడుపులు ప్రదర్శించినా, చంద్రబాబు నాయుడు కొన్ని సమస్య పై తగ్గితే జగన్ రెడ్డి చిచ్చు రేపుతారు. రేవంత్ రెడ్డి తగ్గితే కేసిఆర్ చిచ్చు పెడతారు. కొందరు ఉద్యమకారులు నీటివివాదాలు విషయం లో అనుభవజ్ఞులు మళ్ళీ కెసిఆర్, జగన్ యాక్టివ్ అవుతారు జనాన్ని రెచ్చగొడతారు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. కెసిఆర్ ను, జగన్ రెడ్డి నీ జనాలు చూసి చూసి, విసుగు చెంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు రెచ్చగొడితే ప్రజలు. రెచ్చి పోయి. విద్వేషాలు పెంచుకుంటారా అంటే. మిలియన్ డాలర్ ప్రశ్న? వీరి ఇద్దరికి ( కెసిఆర్ & జగన్ ) పరిష్కారం కన్నా వారి మనుగడ & రాజకీయం ప్రయోజనాలు ముఖ్యం. ఈ పరిస్థితుల్లో నేడు కీలకమైన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు దాదాపు కీలక మైన సమస్య లు పరిష్కారం అవుతాయి అని ఆశ లేదు. సమస్యలు పరిష్కారం కావు అని నిరాశా లేదు. కేవలం ఉన్న నమ్మకం. ఒక ప్రశాంతమైన వాతావరణం లో…. సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు & రేవంత్ రెడ్డి కీలక సమస్యలు పరిష్కారం దిశగా ఒక ప్రయత్నం చేస్తున్నారు.