News
సెప్టెంబర్ 30వ తేది నాటికి 100 శాతం పురోగతి సాధించాలి కలెక్టర్ ఆదేశం

కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ వారు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద వెనుకబడిన ప్రాంతాల్లో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్యం, వ్యవసాయం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, మహిళ శిశువుల సంక్షేమం సంబంధిత 6 అంశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలంలో కెవిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం సంపూర్ణత అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత సంవత్సరం జనవరిలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం తీసుకొని రావడం జరిగిందన్నారు. భారత ప్రభుత్వం ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం అమలు చేసేందుకు గాను 500 వెనుకబడిన మండలాలను ఎన్నుకోవడం జరిగిందని అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 15 మండలాలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. 15 మండలాలలో కర్నూలు జిల్లా నుండి మద్దికేర, చిప్పగిరి, హోళగుంద మండలాలు ఎన్నిక చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
సంపూర్ణత అభియాన్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమం మొదటి ఫేస్ లో నీతి ఆయోగ్ సంస్థ వారు గుర్తించిన 6 అంశాల్లో సెప్టెంబర్ 30 వ తేది నాటికి 100 శాతం పురోగతి సాధించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.

సెప్టెంబర్ మాసంలోపు నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం సాధించినట్లైతే మిగిలిన 33 అంశాల్లో బ్లాక్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు.
వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి 3 ఇండికేటర్లు, ఐసిడిఎస్ శాఖ కి సంబంధించి 1 ఇండికేటర్, వ్యవసాయ శాఖ కి సంబంధించి 1 ఇండికేటర్, డి ఆర్ డి ఎ కి సంబంధించి 1 ఇండికేటర్ మొత్తం 6 ఇండికేటర్లు (అంశాలు) ఉన్నాయన్నారు. వ్యవసాయ శాఖ మినహాయించి మిగిలిన అంశాల్లో ఇప్పటికే 80 శాతం పురోగతి సాధించామని, సెప్టెంబర్ 30 వ తేది నాటికి 100 శాతం పురోగతి సాధించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

గర్భిణీ స్త్రీల యాంటినేటల్ రిజిస్ట్రేషన్ లో 92 శాతం పురోగతి సాధించామని, సెప్టెంబర్ లోపు 100 శాతం రిజిస్ట్రేషన్ లు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్స్ మిస్ కాకుండా చూసుకోవాలన్నారు.
డయాబెటిక్ స్క్రీనింగ్ కి సంబంధించి మండలంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా వైద్య ఆరోగ్య శాఖ వారు వెళ్లి హైపర్ టెన్షన్ డయాబెటిస్ అంటే షుగర్ మరియు బిపి టెస్ట్ లు అందరికీ కూడా స్క్రీన్ చేయడం జరుగుతుందన్నారు. ఎవ్వరికైనా సమస్య ఉంటే సంబంధిత వారికి మెడిసిన్స్ కూడా ఇస్తారన్నారు. కనుక దయచేసి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేయించుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు.

సప్లిమెంటరీ న్యూట్రిషన్ కి సంబంధించి గర్భిణీ మహిళలు ఎవ్వరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సంబంధిత గర్భిణీ స్త్రీలకు ప్రతినెలా హిమోగ్లోబిన్ టెస్ట్ చేయడంతో పాటు విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. ఈ అంశాంలో ఇప్పటికే 100 శాతం పురోగతి సాధించామని, పురోగతి శాతం తగ్గకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు..
వ్యవసాయ శాఖ కి సంబంధించి సాయిల్ టెస్టింగ్ చేయడం ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఏదైనా సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు.
సాయిల్ లో ఎంత ఎరువులు కలపాలి, నైట్రోజన్ నిష్పత్తి ఎంత ఉండాలని కనుకోవాలంటే సాయిల్ టెస్టింగ్ జరగాలన్నారు. సాయిల్ టెస్టింగ్ అంశంలో పురోగతి సాదించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు..

జడ్పిటిసి, ఎంపీపీ, ఇతర ప్రజాప్రతినిధిలు మద్దికేర మండలంలో కాలేజీ లేదనే విషయాన్ని తన దృష్టికి తీసుకొని వచ్చారని ఉన్నత అధికారులతో చర్చించి జూనియర్ కానీ డిగ్రీ కాలేజ్ గాని తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు మాట్లాడుతూ అస్పిరేషనల్ బ్లాక్ (సంపూర్ణత అభియాన్) కార్యక్రమాల ద్వారా గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. అదే విధంగా వ్యవసాయానికి సంబంధించి భూసార పరీక్ష కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన భూసార పరీక్షలు నిర్వహించి లాభసాటి పంట పండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అస్పిరేషనల్ బ్లాక్ తరహాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు తమ వంతు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.

కేంద్ర నితీఅయోగ్ అధికారి శృతి సబర్వాల్ మాట్లాడుతూ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం క్రింద సంపూర్ణత అభయాన్ కార్యక్రమంలో పొందుపరిచిన 6 అంశాల్లో 100 శాతం పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు..
అనంతరం సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం, సంపూర్ణత అభియాన్, పోషణ్ అభియాన్, ఐసిడిఎస్ ద్వారా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యక్రమాలు, వ్యవసాయం శాఖ వారు ఏర్పాటు చేసిన భూసార పరీక్ష మట్టి నమూనా, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ అభియాన్ కిట్స్ ను కలెక్టర్, పత్తికొండ శాసనసభ్యులు, కేంద్ర నితీఅయోగ్ అధికారి శృతి సబర్వాల్ పంపిణీ చేశారు.

యాస్పిరేషనల్ బ్లాక్ కు సంబంధించి ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ పోస్టర్ పై కలెక్టర్, పత్తికొండ శాసనసభ్యులు, ఢిల్లీ నీతిఅయోగ్ అధికారి శృతి సబర్వాల్ సంతకాలు చేశారు.

అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చదివిన పాఠశాలలో విద్యను అభ్యసించడానికి అర్హత సాధించిన విద్యార్థి వినయ్ కుమార్ ను కలెక్టర్ పి.రంజిత్ బాషా, పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు శాలువతో సత్కరించారు. అదే విధంగా సదరు తరగతిలో అతను టీమ్ లీడర్ గా ఉండటం పట్ల విద్యార్ధిని అభినందించారు.

తొలుత డిఆర్డిఎ పిడి, వైద్య ఆరోగ్య శాఖ అదనపు డిఎమ్హెచ్ఓ, వ్యవసాయ శాఖ అధికారులు వారి శాఖల నుండి చేపట్టిన పురోగతి వివరాల గురించి వివరించారు..సంబంధిత అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో పత్తికొండ ఆర్డిఓ రామలక్ష్మి, సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, డిఆర్డిఎ పిడి సలీం భాష, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, మద్దికెర గ్రామ సర్పంచ్ సుహాసిని, ఎమ్ పిపి అనిత యాదవ్, జెడ్పిటిసి మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business4 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు