News
క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న 7 మంది బెట్టింగ్ రాయుల్లను సిఐ శ్రీరామ్ అరెస్టు చేసి వారి వద్ద నుండి 91 లక్షల నగదు స్వాధీనం, 7 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముందు హాజరు పరచరు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెలలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చాలామంది యువకులు క్రికెట్ బెట్టింగ్ ను ఆన్ లైన్ లో ఆడుతూ, బెట్టింగ్ కు వ్యసనపరులుగా మారి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా అప్పులు చేసి మరీ, ఆ అప్పులు తీర్చలేకఇంట్లో తల్లితండ్రులకు చెప్పుకోలేక , తమ భవిష్యత్తు పై వారి తల్లి తండ్రులు పెట్టుకున్న ఆశలను అడియశలు చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుచున్నాయని బెట్టింగ్ ను ఎలాగైనా అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డిఎస్పి M. హేమలత పర్యవేక్షణ లో ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీ రామ్ మరియు వారి సిబ్బంది రాబడిన సమాచారము మేరకు 18.05.2025 వ తేదీన సాయంత్రం 03.30 గంటలకు వాల్మీకి నగర్ లోని వాల్మీకి గుడి కి ఎదురుగా మొబైల్ ఫోన్ లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై దాడి చేసి ఎస్. ఆర్.నాగరాజును అదుపులోనికి తీసుకోగా మిగిలిన ముద్దాయులు పారిపోయారు. అతని నుండీ నగదు 50,000 వేల రూపాయలను స్వాదీన పరచుకుని ఆదోని వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఏపీ గేమింగ్ యాక్ట్ ( క్రికెట్ బెట్టింగ్ ) క్రింద కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.



టెక్నాలజీ ఆధారంగా దొరికిన సమాచారం మేరకు సిఐ శ్రీ రామ్ కర్నూలు, హైదరాబాదు, ఒంగోలు, చిలకలూరు పేట, బెంగళూరు సిటిలో పూర్తి సమాచారాన్ని తెలుసుకొని 30.05.2025వ తేదీన మద్యాహ్నం 11.30 గంటలకు ఆదోని టౌన్ లోని ఎల్లమ్మ కొండ లోని మర్రి చెట్టు దగ్గర 7 మంది
1. ఆదోని పట్టణం మసీదుపుర కు చెందిన ఇస్మాయిల్ @ ఇస్మాయిల్, వయసు 44 సం. లు
2. ఆదోని పట్టణం బోయగిరికి చెందిన బోయ మహానంది వయసు 55 సం. లు,
3. ఆదోని పట్టణం మరాఠి వీధికి చెందిన బోయ రమేశ్, వయసు 26 సం. లు,
4. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీకి చెందిన చిక్కబళ్లాపూర్ వాసి రాజేష్, వయసు 38 సం. లు,
5. ఒంగోలు జిల్లా జరుగుమల్లి మండలం, ఎద్దులూరిపాడు గ్రామనికి చెందిన చుండి శ్రీనివాస రావు @ నాయుడు, వయసు 48 సం .లు,
6. ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ సత్యనారాయణపురం కు చెందిన అడ్డాల కల్యాణ్, వయసు 33 సం,
7. హైదరాబాద్ కు చెందిన రఘు ఆచారి
ఏడు మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి 07 మొబైల్ ఫోన్ లు 91,00,000 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముందు హాజరు పరచరు.
వీరు ఆడుతున్న క్రికెట్ బెట్టింగ్ యాప్స్
1. నేషనల్ ఎక్సేంజ్ 9
2. రాధే ఎక్సేంజ్ ,
3. వజ్రా ఎక్సేంజ్,
4. నేషనల్ 777,
5. మోర్ ఎక్సేంజ్

ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి సాంకేతికత సహాయంతో క్రికెట్ బుకీలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన ఆదోని డిఎస్పీ హేమలతను , ఆదోని వన్ టౌన్ సిఐ శ్రీరామ్, ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ మునిస్వామి, రంగస్వామి, ఏకవీర, ఫక్కీరప్ప, హుస్సేన్ భాషాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.

News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 18 06 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 17 06 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 16 06 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


-
News2 weeks ago
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం
-
News3 weeks ago
కౌతాళం మండలం లో దారుణం
-
News4 days ago
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరు. గడ్డా ఫక్రుద్దీన్
-
News2 weeks ago
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
-
News2 weeks ago
రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ
-
News2 weeks ago
వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
-
News2 weeks ago
మెడికల్ కళాశాల పనులు ప్రారంభించాలి
-
News4 days ago
వీర జవాన్ కుటుంబానికి లక్ష ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే