News
వైయస్సార్ సిపి భారీ బైక్ ర్యాలీ
కర్నూలు జిల్లా ఆదోని లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు చంద్రబాబు పేద ప్రజలకు ఇచ్చే ఇళ్లను శవ పేటికతో పోల్చినందుకు నిరసనగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో జయ మనోజ్ రెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారుల గుండా భీమాస్ సర్కిల్ శ్రీనివాస్ భవన్ మీదుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జయం మనోజ్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలతో అలంకరించారు. అనంతరం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కు తోడుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నాడని అన్నారు.


News
అదోనిలో 30 లక్షలు విలువ చేసే 35 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోనిలో టూ టౌన్ పోలీసులు సుమారు 30 లక్షలు విలువ చేసే 35 టు వీలర్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సిఐ తెలిపిన వివరాల మేరకు వాహనాలు తనిఖీలు చేస్తుండగా మంత్రాలయం నియోజకవర్గం చిన్న తుంబలం గ్రామానికి చెందిన వడ్డే మహేష్ అనే వ్యక్తి ని అనుమానంతో అపి విచారించగా తాను చోరీ చేసుకుని వెళ్తున్న వాహనమని గుర్తించి అతన్ని విచారించగా వడ్డే మహేష్ నుంచి నుంచి చోరీ అయిన సుమారు 30 లక్షల విలువచేసే 35 బైక్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వడ్డే మహేష్ కుమార్ ని అరెస్టు చేసి రిమైండ్ కి తరలించిన టూటౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.



News
అదోనిలో 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీసుల వాహన తనిఖీల్లో అక్రమంగా ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు అక్రమంగా తరలిస్తున్న షేక్ షాకీర్ , అక్షయ్ జాదవ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. వెండి బిస్కెట్లకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో వెండిని ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పజెప్తామని సిఐ తెలిపారు.


News
సూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం
ఆదోని 23-06-2026 మధ్యాహ్నం 12 గంటలకు ఆకాశంలో సూర్యుని చుట్టూ ఏర్పడిన వలయం.. మీరు ఫోటోలో చూస్తున్నది ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఖగోళ దృగ్విషయం. దీనిని సూర్య పరివేషం (Solar Halo) లేదా 22-డిగ్రీల హాలో (22° Halo) అని పిలుస్తారు. పాతకాలంలో దీనిని చూసి వర్షం పడే సూచనగా భావించేవారు, ఎందుకంటే ఈ రకమైన మేఘాలు సాధారణంగా వాతావరణంలో మార్పును లేదా వర్షాన్ని సూచిస్తాయి.
ఇది ఎలా ఏర్పడుతుందో ఇక్కడ చూద్దాం:
- మంచు స్ఫటికాలు (Ice Crystals): ఆకాశంలో చాలా ఎత్తులో ఉండే సిరస్ (Cirrus) మేఘాలలో మిలియన్ల కొద్దీ చిన్న చిన్న షడ్భుజి (hexagonal) ఆకారపు మంచు స్ఫటికాలు ఉంటాయి.
- కాంతి వక్రీభవనం (Refraction): సూర్యకాంతి ఈ మంచు స్ఫటికాల గుండా ప్రయాణించినప్పుడు, అది వంగి (refract అయి) దాదాపు 22 డిగ్రీల కోణంలో విడిపోతుంది.
- ఇంద్రధనస్సు లాంటి వలయం: ఇలా వక్రీభవనం చెందిన కాంతి సూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయంలా (రింగ్ లా) మనకు కనిపిస్తుంది. దీని అంచులలో కొద్దిగా ఇంద్రధనస్సు రంగులు కూడా కనిపిస్తాయి.
