News
అదోనిలో 10 మంది అభ్యర్థుల పోటీ, వారి గుర్తులు
కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ అభ్యర్థుల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఆదోని అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి/ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అభ్యర్థులకు తెలియజేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆదోని అసెంబ్లీ స్థానానికి పోటీ చేయు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల వివరాలను అభ్యర్థులకు తెలియజేశారు. ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఆప్షన్ మేరకు గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఫార్మ్-ఏ, ఫార్మ్-బి ఇచ్చిన పార్టీల వారికి పార్టీ రిజర్వ్ చేసిన గుర్తే కేటాయించడం జరుగుతుందన్నారు. ఎలక్షన్ ఏజెంట్స్ ను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ఫార్మ్-8 ఇవ్వడంతో పాటు వ్యయ నిర్వహణ కోసం ఒకరిని ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపారు
అభ్యర్థుల పేర్లు, పార్టీ, అభ్యర్థికి కేటాయించిన గుర్తులు
గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీ అభ్యర్థులు
- ఆసియా బాను అమ్లివాలె, బహుజన సమాజ్ పార్టీ , ఏనుగు
- డా. పి. వి పార్థసారథి, భారతీయ జనతా పార్టీ, కమలం.
- జి రమేష్ యాదవ్ , భారత జాతీయ కాంగ్రెస్, హస్తం
- వై సాయి ప్రసాద్ రెడ్డి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ , సీలింగ్ ఫ్యాన్
నమోదు కాబడిన రాజాకీయ పార్టీల అభ్యర్థులు - కె. రంగన్న, జై భీమ్ రావు భారత్ పార్టీ, కోర్టు
స్వతంత్ర అభ్యర్థుల పేర్లు, పార్టీ, గుర్తులు - ఉరుకుందు వడ్డే , స్వతంత్ర అభ్యర్థి, లాప్ టాప్
- జి. జయన్న, స్వతంత్ర అభ్యర్థి, పండ్ల బుట్ట
- కే దస్తగిరి నాయుడు, స్వతంత్ర అభ్యర్థి, వజ్రం
- బి. నాగరాజు, స్వతంత్ర అభ్యర్థి, ఆపిల్
- జి. యువరాజ్, స్వతంత్ర అభ్యర్థి, గ్లాస్ టoబ్లర్
ఈ సమావేశంలో కార్యాలయపు పరిపాలన అధికారి సి. ఆర్ . శేషయ్య, ఆదోని తహశీల్దార్ హసీనా సుల్తానా, ఉప తాసిల్దారులు, వినీత్, కౌసర్ భాను, రుద్ర గౌడ్, రామేశ్వర్ రెడ్డి, ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
