ఉపాధి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

ఉపాధి లేక గ్రామాలు ఖాళీ అవుతుంటే ఇక్కడే పని చేసుకుంటున్నా ఉపాధి కూలీల జీతాలు చెల్లించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో మంగళవారం దొడ్డనకేరి, మంత్రికి, పెసల బండ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గత ఐదు వారాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే గ్రామాలు ఖాళీ అవుతుంటే, ఇక్కడే పనులు కల్పిస్తామని చెబుతున్న అధికారులు వేతనాలు చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని, చట్టంలో చెప్పినట్లుగా పని చేసిన  14 రోజుల లోపల వేతనాలు ఇవ్వాల్సి ఉన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఉపాది హామీ వేతనాలు ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కూలీలతో కలిసి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు
ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version